మరో ఛాలెంజింగ్ రోల్ లో కనిపించనున్న ఈషా రెబ్బా.?

Published on Aug 13, 2020 3:00 am IST


మన టాలీవుడ్ లో తెలుగు వచ్చిన అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఈషా రెబ్బా కూడా ఒకరు. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో నటించిన ఈ తెలుగు బ్యూటీ ఈ మధ్య కాలంలో పలు వెబ్ సిరీస్ లకు కూడా ఒకే చెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవలే కాలంలో డిజిటల్ రంగం ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో అందరికీ తెలిసిందే.

అందులో ముఖ్యంగా వెబ్ సిరీస్ లకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీనితో అనేక స్టార్ నటులు కూడా వెబ్ సిరీస్ లలో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అలా హిందీలో హిట్ అయిన “లస్ట్ స్టోరీస్” రీమేక్ వెబ్ సిరీస్ లో ఈసా ఒప్పుకునేందుకు అంగీకరించింది.

అది నిజంగానే ఒక ఛాలెంజింగ్ రోల్ ఇపుడు మళ్ళీ అదే తరహాలో ఒక డార్క్ రోల్ లో ఈషా కనపడనున్నట్టు తెలుస్తుంది. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ప్రిపేర్ చేస్తున్న ఓ వెబ్ సిరీస్ కు గాను ఈషానే మెయిన్ లీడ్ అన్నట్టు తెలుస్తుంది. ఈ రోల్ చాలా బోల్డ్ మరియు డార్క్ గా ఉంటుందట. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉండనుండో చూడాలి.

సంబంధిత సమాచారం :

More