‘ఈశ్వర్’ ఫేమ్ హను సినిమా సాంగ్ ని లాంఛ్ చేసిన మంచు హీరో 

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మాస్ ఎంట్రీ ఇచ్చిన చేసిన చిత్రం ‘ఈశ్వర్’ కోసం తెలిసిందే. అయితే ఆ సినిమాతో వెండితెరకు పరిచయమైన హనుకోట్ల నటుడిగా, దర్శకుడిగా  H. పద్మా రమకాంత రావు, రామకృష్ణ కొళివి నిర్మాణ సారథ్యంలో సిటడెల్ క్రియేషన్స్, డిజిక్వెస్ట్ నిర్వహణలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే “ది డీల్ “. ఇక ఈ సినిమా అక్టోబర్ 18న విడుదల కాబోతుంది.

ఈ సినిమాకి సంబంధించిన “ఏమయ్యిందో ఏమయ్యిందో” పాటని ప్రముఖ హీరో మరియు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ మంచు విష్ణు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డిజిక్వెస్ట్ అధినేత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ పూర్వ అధ్యక్షులు శ్రీ K. బసిరెడ్డి, ప్రముఖ నిర్మాత శ్రీ PLK రెడ్డి, “ది డీల్ ” చిత్ర నిర్మాత రామకృష్ణ కొళివి, చిత్ర సమర్పకులు డా. అనితారావు, దర్శకులు డా. హను కోట్లతో పాటు చిత్ర బృందం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ “తెలుగు యూనివర్సిటీలో యాక్టింగ్ ప్రొఫెసర్ గా పని చేస్తూ ఎంతో మందికి శిక్షణనిస్తున్న డా. హను కోట్ల గారికి అల్ ది బెస్ట్ చెబుతూ ఈ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అభినందించారు.

Exit mobile version