నవదళపతి సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మా నాన్న సూపర్ హీరో’ ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాను పూర్తి ఎమోషనల్ డ్రామాగా తీర్చిదిద్దారు మేకర్స్. తండ్రీకొడుకుల బంధంపై తెరకెక్కిన ఈ సినిమా ఆడియెన్స్‌కి ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలను మిగిలిస్తుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.
దానికి తగ్గట్లుగానే ఈ చిత్ర పోస్టర్స్, సాంగ్స్, టీజర్‌లు ఉండటంతో ఈ సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది. ఇక తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేశ్ బాబు లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ప్యూర్ ఎమోషన్స్‌తో సాగింది. తండ్రి కోసం కొడుకు ఏం చేయగలడు, ఎక్కడివరకు వెళ్తాడు అనేది మనకు ఈ ట్రైలర్‌లో చూపెట్టే ప్రయత్నం చేశారు.
ఇక సుధీర్ బాబు నుంచి మరోసారి సాలిడ్ పర్ఫార్మెన్స్ చూడబోతున్నట్లుగా ఈ ట్రైలర్ ప్రూవ్ చేసింది. మిగతా నటీనటులు కూడా వారి పాత్రలను ఓన్ చేసుకున్నట్లుగా చిత్ర యూనిట్ చెబుతోంది. అభిలాష్ కంకర డైరెక్ట్ చేస్తున్న ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ చిత్రానికి జేక్రిష్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 11న గ్రాండ్ రిలీజ్‌కి రెడీ చేస్తున్నారు మేకర్స్.