‘గూఢచారి 2’ సెట్స్‌లో ఇమ్రాన్‌కి గాయాలు

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ సీక్వెల్ మూవీ ‘గూఢచారి 2’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ హీరో అడివి శేష్ మరోసారి పవర్‌ఫుల్ స్పై అవతారంలో అదిరిపోయే యాక్షన్ సీన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే, తాజాగా హైదరాబాద్‌లో షూటింగ్ సమయంలో ఇమ్రాన్ హష్మి ఓ యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా అతనికి గాయాలు అయ్యాయి. అతని మెడ భాగంలో గాయం అయ్యింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

దీంతో ‘గూఢచారి 2’ సెట్స్‌లో ఇమ్రాన్ హష్మీ గాయాలపై ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, తనకు ఎలాంటి ప్రమాదం లేదని, చికిత్స తీసుకుంటున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

Exit mobile version