దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. ఈ సినిమాలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను అలరించిన తీరు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పక్కా మాస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా క్రియేట్ చేస్తున్న వండర్స్‌కి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ సినిమాలో క్లైమాక్స్ అందరినీ అయోమయంలోకి నెట్టేసింది.
ఈ సినిమాలో దేవర పాత్రను తన కొడుకు చంపుతాడు. అయితే, అసలు దేవరను తన కొడుకు ఎందుకు చంపాడు అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది ఇప్పుడు. ఇదే ప్రశ్నపై దర్శకుడు కొరటాల శివ మంచి రిప్లై ఇచ్చాడు. దేవరను చూస్తూ, ఆయన కథలు వింటూ పెరిగిన కొడుకు చివరకు తన తండ్రిని ఎందుకు చంపాడనేది ఓ దర్శకుడిగా కంటే రైటర్‌గా చాలా ఎంజాయ్ చేశాను. దేవర కొడుకు ఎలాంటి కథను రాస్తున్నాడో ఎవరికీ తెలియదు. ఇదొక ఎమోషనల్ అడుగుగా నిలిచింది. అతడు రాసే కథ కొన్ని తరాలకు వరంగా మారనుంది.
ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్. ఇలాంటి డ్రామాను ఓ రైటర్‌గానే ఎంజాయ్ చేసాను. దీనికి సంబంధించిన అసలు కథ తెలియాలంటే ‘దేవర-2’ చూడాల్సిందేనని కొరటాల కాన్ఫిడెంట్‌గా చెప్పారు.