‘గమ్యం’, ‘వేదం’ లాంటి సినిమాలతో టాలీవుడ్ కి కొత్త తరహా సినిమాలని పరిచయం చేసిన దర్శకుడు క్రిష్. అలాంటి దర్శకుడు నిర్మాతగా మారి ఉషా కిరణ్ మూవీస్ తో కలిసి నిర్మించిన సినిమా ‘దాగుడు మూతల దండాకోర్’. రాజేంద్ర ప్రసాద్, బేబీ సార అర్జున్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో కోడి పుంజు ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. పక్కా రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సున్నితమైన బావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయని సమాచారం.
సున్నితమైన బావోద్వేగాలు ఉంటూనే ఓ కోడి పుంజు చుట్టూ ఈ కథ తిరుగుతుందని ఆయన తెలియజేశారు. క్రిష్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ‘సినిమాకి వచ్చిన ప్రేక్షకులని సినిమా అయ్యేంతవరకూ ఎంటర్టైన్ చెయ్యడం ఒక చాలెంజ్ అని చెప్పాలి. అలాగే ఒక మంచి స్ట్రాంగ్ కథని చెబితే చూడటానికి ఆడియన్స్ ఎప్పుడు సిద్దంగా ఉంటారని’ తెలిపాడు. క్రిష్ తో పాటు ఈ సినిమా డైరెక్టర్ ఆర్.కె మలినేని కూడా ఈ సినిమా విజయంపై ఎంతో నమ్మకంగా ఉన్నాడు.