ఈ సినిమాతోనైనా బ్రేక్ వస్తోందా ?

ఈ సినిమాతోనైనా బ్రేక్ వస్తోందా ?

Published on May 29, 2019 2:00 AM IST

సుమన్ బాబు దర్శకత్వంలో హీరో శ్రీరామ్, కమెడియన్ అలీ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎర్ర చీర’. ఈ నెల 25న రెండవ షెడ్యూల్ పూర్తి చేశారు. రెండవ షెడ్యూల్ లో భాగంగా శ్రీరామ్ పై యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించారు. ఈ సినిమాలో ఛేజింగ్ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయట. మరి ఈ సినిమాతోనైనా శ్రీరామ్ కి బ్రేక్ వస్తోందేమో చూడాలి. శ్రీరామ్ తెలుగు వ్యక్తే అని అందరికీ తెలిసిన విషయమే. హీరోగా తెలుగులోనే ఎంట్రీ ఇచ్చిన సరైన సక్సెస్ లేక, తమిళ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కొన్ని తమిళ్ సినిమాల్లో నటించాడు. చాలా కాలం తరువాత ఇప్పుడు శ్రీరామ్ డైరెక్ట్ గా తెలుగు సినిమాలో నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో అలీ నటించిన సన్నివేశాలు కూడా కడుపుబ్బా నవ్వించేలా ఉంటాయని చిత్రబృందం చెబుతుంది. ముఖ్యంగా హర్రర్ సన్నివేశాల్లో అలీ నటన నవ్వులు పూయిస్తోందట. సెప్టెంబర్ మొదటివారంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకునివచ్చేలా నిర్మాతలు సన్నాహకాలు చేస్తున్నారు. శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు