బన్నీ ఫ్యాన్స్ చేసిన పనికి అందరూ షాకయ్యారు

Published on Mar 31, 2020 6:04 pm IST


ఈమధ్య కాలంలో స్టార్ హీరోల అభిమానుల టాలెంట్ చూసి షాకవుతున్నారు నెటిజన్లు. తమ హీరో కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ ఏమాత్రం ఆలస్యమైనా అభిమానులే స్వయంగా వాటిని రూపొందించి రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే ఆ ఫ్యాన్ మేడ్ పోస్టర్లు అఫీషియల్ పోస్టర్లకు ఏమాత్రం తీసిపోవడం లేదు. తాజాగా ఇలాంటి పోస్టర్ ఒకదాన్నే బన్నీ ఫ్యాన్స్ రూపొందించారు.

బన్నీ ప్రజెంట్ సుకుమార్ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు. దీని కోసం గడ్డం పెంచి లుక్ కూడా మార్చారు. కానీ ఇంతలో కరోనా లాక్ డౌన్ కావడంతో షూటింగ్ ఆగింది. దీని ప్రభావం ఫస్ట్ లుక్ రిలీజ్ మీద పడుతుందని అనుకున్నారో ఏమో కానీ అభిమానులు బన్నీ ప్రజెంట్ లుక్ రిఫరెన్స్ తీసుకుని ఒక పోస్టర్ డిజైన్ చేసి ఫస్ట్ లుక్ పేరుతో నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ లోగో, అఫీషియల్ టీమ్ మెంబర్స్ పేర్లన్నీ వేసి మరీ రిలీజ్ చేశారు.

అది చూసిన చాలామంది నిజంగానే అఫీషియల్ లుక్ అనుకున్నారు. కానీ తర్వాత విషయం తెలిసి అఫీషియల్ పోస్టర్ కాదా.. అయినా భలే చేశారే అంటూ ముక్కున వేలేసుకున్నారు. బన్నీ పిఆర్ టీమ్ సైతం పోస్టర్ డిజైన్ చాలా బాగుందని ఆశ్చర్యానికి గురయ్యారు.

సంబంధిత సమాచారం :

More