ఇటీవల సినిమాలను థియేటర్లలో కంటే కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో రిలీజ్ చేసేందుకే మేకర్స్ ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా చిన్నసినిమాలు, కాంట్రోవర్సీ సినిమాలకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సెకండ్ ఆప్షన్‌గా మారాయి. దీంతో ఓటీటీలో తమ సినిమాలను రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు కొంతమంది మేకర్స్. ఇక ఈ క్రమంలో ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఓ బోల్డ్ మూవీ రానుంది.
సెన్సార్ బోర్డ్ బ్యాన్ చేసిన సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో రిలీజ్ చేసేందుకు ఆ చిత్ర మేకర్స్ రెడీ అయ్యారు. లవ్ అనే పదాన్ని ఇంగ్లీష్‌లో తిరగేసి రాస్తే ‘ఎవోల్’(EVOL) అని వస్తుంది. ఇదే టైటిల్‌తో రామ్ వెలగపూడి అనే డైరెక్టర్ ఓ బోల్డ్ కంటెంట్ మూవీని తెరకెక్కించారు. అయితే, ఇందులో బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో సెన్సార్ బోర్డు ఈ సినిమాను బ్యాన్ చేసింది. దీంతో ఇప్పుడు ఎవోల్ చిత్రాన్ని ఆహాలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆగస్టు 15న ఈ ‘ఎవోల్’ అనే సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా అనౌన్స్ కూడా చేశారు. రెండు జంటల మధ్య జరిగే కథను బోల్డ్‌గా తెరకెక్కించిన ఈ సినిమాలో నటీనటులు అందరూ కొత్తవారే. మరి సెన్సార్ బోర్డు బ్యాన్ చేసిన ఈ ‘ఎవోల్’ మూవీలో బోల్డ్ కంటెంట్ ఏ స్థాయిలో ఉందో తెలియాలంటే ఆగస్టు 15 వరకు వెయిట్ చేయాల్సిందే.