ఇంటర్వ్యూ: బసవ శంకర్‌, గార్గేయి – మా సినిమాకి మంచి స్పందన వస్తోంది !

ఇంటర్వ్యూ: బసవ శంకర్‌, గార్గేయి – మా సినిమాకి మంచి స్పందన వస్తోంది !

Published on Oct 15, 2019 5:59 PM IST

రాకేష్ వర్రే, గార్గేయి ఎల్లాప్రగడ జంటగా దర్శకుడు బసవ శంకర్‌ తెరకెక్కించిన చిత్రం ఎవరికీ చెప్పొద్దు. ఈనెల 8న విడుదలైన ఈ చిత్రం మంచి ఆదరణ దక్కించుకోవడంతో ఈ చిత్ర దర్శకుడు బసవ శంకర్‌ , హీరోయిన్ గార్గేయి ఎల్లాప్రగడ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు

 

మీ తొలి చిత్రంగా ఈ కథనే మీరు ఎందుకు ఎంచుకున్నారు?

 

ఈ సినిమాలోని మెయిన్ పాయింట్ మనందరి జీవితాల్లో ఏదొక దశలో అనుభవించిందే. కుల సమస్యను ఎదుర్కొంటున్న ప్రేమకథగా ఈ కథ పై నాకు ముందు నుంచి నమ్మకం ఉంది. దానికి కారణం కుల సమస్య పై హీరో ఒక ఆసక్తికరమైన ఆలోచనతో ముందుకు రావడం అందరికి నచ్చుతుంది అనుకున్నాను. అనుకున్న విధంగానే అందరికి నచ్చింది.

 

ఈ మధ్య కాలంలో కులం అంశం పై సినిమా రాలేదు. ఇలాంటి సున్నితమైన అంశం పై సినిమా తియ్యడం రిస్క్ అనిపించలేదా ?

 

నాకు తెలిసి ఇటీవల కాలంలో కుల సమస్య పై వచ్చిన న ఒకే ఒక చిత్రం మా సినిమానే. అందుకే ఈ సినిమా తీయాలని నిర్ణయించుకున్నాం. స్క్రిప్ట్ పై మాకు ఉన్న నమ్మకం కారణంగా మాకు ఎప్పుడూ రిస్క్ అనిపించలేదు.

 

మీ సినీ ప్రయాణంలో అనుభవాల గురించి చెప్పండి ?

 

నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఐదు చిత్రాలకు పనిచేశాను. నేను అన్ని చిత్రాలలో సమానంగా కష్టపడి పనిచేసినప్పటికీ, వాటిలో రెండు మాత్రమే ఆడాయి. రన్ రాజా రన్ మరియు పెళ్లి చూపులు. ఇక 15 సంవత్సరాల క్రితమే నేను పరిశ్రమలోకి వచ్చాను. సినిమాలకు పని చేస్తూనే అవకాశాలు కోసం ప్రయత్నాలు చేసేవాడ్ని. అలా ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాను.

 

మీ (గార్గేయి) క్యారెక్టర్ చుట్టే సినిమా నడుస్తోంది. కథ వినగానే ఏమనిపించింది ?

 

డైరెక్టర్ గారు చాల సున్నితమైన కథలో మంచి హాస్యాన్ని రాసుకున్నారు. విన్నప్పుడే సినిమా సూపర్ హిట్ అవుతుందని అనిపించింది.

 

మీ నటనకు ఎలాంటి ప్రేక్షకుల నుండి స్పందన వస్తోంది ?

 

అమేజింగ్. నేను నిజంగా ఊహించలేదు. నాకు ఈ సినిమాలో ఇంత పేరు వస్తోందని.. అందరికీ ఇంతగా నా పాత్ర నచ్చుతుందని. చాల సంతోషంగా ఉంది.

 

బసవ శంకర్‌ గారు మీ మూవీకి స్పందన ఎలా ఉంది?

 

ప్రేక్షకుల నుండి వస్తోన్న స్పందన చాలా బాగుంది. సినిమాలోని సీన్స్ గురించి సినిమా చూసి వచ్చిన తరువాత ఆడియన్స్ ఇంట్రస్ట్ గా మాట్లాడుకోవడం నాకు సంతోషాన్ని కలిగించింది.

 

ఈ సినిమా హీరో రాకేశ్ గురించి చెప్పండి ?

 

ఈ సినిమా స్క్రీన్ పైకి రావడానికి కారణం తనే. మేం ఈ స్క్రిప్ట్ పట్టుకొని చాలా ప్రొడక్షన్ హౌసెస్ కి వెళ్లినా కొన్ని కారణాలు వల్ల అవి వర్కౌట్ అవ్వలేదు. ఆ సమయంలో కేవలం నా పై నా కథ పై ఉన్న నమ్మకంతో తనే ధైర్యం చేసి ఈ సినిమాకి నిర్మాతగా మారి.. ఈ సినిమా చేశాడు.

 

మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి ?

 

కొన్ని కథలు ఉన్నాయి. త్వరలోనే తరువాత సినిమా పై క్లారిటీ వస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు