త్వరలో చైతూ “తండేల్” నుండి వరుస అప్డేట్స్!

త్వరలో చైతూ “తండేల్” నుండి వరుస అప్డేట్స్!

Published on Jun 26, 2024 3:00 AM IST

టాలీవుడ్ హీరో, అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో, దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తండేల్. ఇది అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించి, భారతదేశానికి తిరిగి రావడానికి ముందు దాదాపు రెండేళ్ల జైలు జీవితం గడిపిన రాజు యొక్క నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. శ్రీకాకుళం లో ఇటీవల ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్ జూలై నెలలో లో ప్రారంభం కానుంది.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ చిత్రం నుండి వరుస అప్డేట్స్ రానున్నాయి. త్వరలో ఈ చిత్రం నుండి అప్డేట్స్ ను ఇవ్వనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంను GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పకులు గా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 20, 2024న విడుదల థియేటర్ల లోకి రానున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు