ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : అలీ రెజా – నాగ్ సర్ నా జీవితాన్ని మార్చారు !

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : అలీ రెజా – నాగ్ సర్ నా జీవితాన్ని మార్చారు !

Published on Oct 12, 2020 5:07 PM IST

యంగ్ యాక్టర్ అలీ రెజా బిగ్ బాస్ సీజన్ 3తో బాగా ప్రాచుర్యం పొందాడు. ఆయన నటించిన వెబ్ సిరీస్ ‘ఎక్స్‌పైరీ డేట్‌’ జీ 5లో రీసెంట్ గా ఎక్స్ క్లూజివ్ గా విడుదలైంది. ఈ సిరీస్‌కి దర్శకత్వం వహించినది తెలుగు దర్శకుడు శంకర్ కె. మార్తాండ్ కావడం విశేషం. స్నేహా ఉల్లాల్, టోనీ లూక్, మధు షాలిని, అలీ రెజా ప్రధాన పాత్రల్లో నటించిన దీనిని నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. నిర్మించింది. శరత్ మరార్ నిర్మాత. అక్టోబర్ 2న హిందీ వెర్షన్, అక్టోబర్ 9న తెలుగు వెర్షన్ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ సందర్భంగా యాక్టర్ అలీ రెజా ప్రత్యెక ఇంటర్వ్యూ…

మీ కొత్త సిరీస్ ‘ఎక్స్‌పైరీ డేట్‌’కి స్పందన ఎలా ఉంది?

చాల బాగుంది. అన్ని చోట్ల నుండి సిరీస్‌కు మంచి స్పందన వస్తోంది. అలాగే హిందీలో కూడా స్పందన చాలా బాగుంది. ఆ కారణంగా నాకు హిందీ ఓటీటీ ప్లాట్ ఫామ్ నుండి ఓ షో ఆఫర్ కూడా వచ్చింది, అది కూడా త్వరలో ముగియనుంది. ఇక ఈ సిరీస్ లో నా పాత్రకు వస్తున్న ఆదరణ సూపర్బ్. నాకు మంచి పాత్ర దక్కింది.

బిగ్ బాస్ అనంతరం మీడియాలో మీరు ఎందుకు ఎక్కువగా ఎక్స్ పోజ్ అవ్వలేదు ?

నిజానికి నేను చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను. కాని అవే ప్రశ్నలు పునరావృతమవుతోన్నాయని నేను ఇక ఆగిపోయాను. అలాగే, నేను షో నుండి బయటకు వచ్చిన మూడవ రోజునే, నాకు నాగ్ సార్ ‘వైల్డ్ డాగ్’లో ఆఫర్ వచ్చింది, ఆ సినిమాలో కూడా నేను కీలక పాత్ర పోషిస్తున్నాను. నేను ఆ సినిమా కోసం శిక్షణ ప్రారంభించాల్సి వచ్చింది. అలాగే, నాకు మరొక ప్రాజెక్ట్ కూడా ఉంది. కాబట్టి, వాటితోనే బిజీగా ఉన్నాను.

బిగ్ బాస్ మీ జీవితాన్ని ఎలా మార్చింది ?

యస్, బిగ్ బాస్ నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. నేను అవకాశాల కోసం కష్టపడుతున్న నటుడిని, నా గురించి చాలామందికి తెలియదు. నాకు బిగ్ బాస్ అవకాశం వచ్చిన క్షణం, నేను దాన్ని ఉపయోగించుకున్నాను. అక్కడ నాకు నా ప్రతిభను నా సామర్థ్యం చూపించే చాన్స్ దక్కింది. అందుకే నాగ్ సర్ స్వయంగా నా పనిని చూసి ఆయన సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చారు.

నాగార్జున లాంటి స్టార్‌తో పని చేయడం ఎలా అనిపిచింది ?

ఆయన నా జీవితంలో చాలా ప్రభావం చూపారు. ఆయనతో కలిసి పనిచేయడం వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ఆయన నా పై భారీ సామర్థ్యాన్ని చూపించారు. నేను బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడే, బిగ్ బాస్ లో నా కోసం ఒక ప్రత్యేక పాత్రను కూడా కేటాయించారు నాగ్ సర్. నేను హౌస్ నుండి బయటకు వచ్చిన క్షణమే నాకు ఆఫర్ ఇచ్చారు. నేను సుదీర్ఘ షెడ్యూల్ కోసం నాగ్ సర్ తో వెళ్తున్నాను. నాగ్ సర్ తో ఎక్కువ సమయం గడపాలని ఎదురు చూస్తున్నాను.

మీ నేపథ్యం గురించి చెప్పండి?

నాన్న ముంబైకి చెందినవారు. ఆయన ఇక్కడ వివాహం చేసుకుని హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. నేను ఇక్కడ పుట్టి పెరిగాను, చిన్నప్పటి నుండి ఎప్పుడూ నటుడిగా మారాలనే కోరుకున్నాను. అందుకే నేను మోడలింగ్‌లో చేరాను, నెమ్మదిగా షోలు చేశాను. అక్కడ నుండి చిన్న పాత్రలు చేసుకుంటూ ఇక్కడివరకూ వచ్చాను.

బిగ్ బాస్ లోకి చాలా మంది ప్రముఖులు వెళ్ళి ఎందుకు విజయవంతం కాలేదు?

బిగ్ బాస్ తాత్కాలిక ఫేమ్. దానిని తీవ్రంగా పరిగణించకూడదు. హౌస్ నుండి బయటకు వచ్చాక చాలా ఆఫర్లు వస్తాయి. అయితే వాటిని ఎన్నుకోవడంలో తెలివిగా ఉండాలి. ముందుగానే అన్ని విషయాలు ప్లాన్ చేయకపోతే, వచ్చిన ఫేం మసకబారుతుంది. చాలామంది వారి ఫేమ్ ను వృధా చేయడాన్ని నేను చూశాను. ఇప్పుడు వారు బాధపడుతున్నారు.

మీరు ఎక్కువగా ఓటీటీ ‘షోసే’ ఎందుకు చేస్తున్నారు?

ఎందుకు చేయకూడదు. ఈ ఓటీటీ మా లాంటి నటులకు పెద్ద వరంగా మారింది. ఇది నా లాంటి వ్యక్తులకు నా ప్రతిభను ప్రదర్శించడానికి మంచి అవకాశం ఇచ్చింది. ఇది భవిష్యత్తులో పెద్దగా ఎదగగల దృడమైన వేదిక. ఇప్పుడు ఓటీటీ విజృంభిస్తున్నది, నేను చాలా సంతోషకరమైన ప్రదేశంలో ఉన్నాను. కాబట్టి ఓటీటీ గురించి ఎటువంటి ఫిర్యాదులు లేవు.

భవిష్యత్ ప్రాజెక్టులు?

ప్రస్తుతానికి, నేను నాగ్ సర్ యొక్క వైల్డ్ డాగ్ చేస్తున్నాను. అలాగే మరో హిందీ వెబ్ సిరీస్ కూడా ఉంది. ఇక నేను జనాదరణను ఎక్కువగా పొందాలనుకుంటున్నాను. అలాగే అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటున్నాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు