ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : అనుష్క – వీరు లేకపోతే నేను లేను..

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : అనుష్క – వీరు లేకపోతే నేను లేను..

Published on Sep 29, 2020 5:22 PM IST

మన దక్షిణాది స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన లేటెస్ట్ చిత్రం “నిశ్శబ్దం” వచ్చే అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కావడానికి రెడీగా ఉంది. ఇక ఈ సమయంలో ఈ చిత్ర హీరోయిన్ అనుష్కతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకున్నాము. మరి స్వీటీ ఎలాంటి విషయాలను పంచుకుందో ఇపుడు చూద్దాం.

 

మీ సినిమాలకు ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు?

 

ఈ బ్రేక్స్ ఏవి నేను కావాలని తీసుకోలేదు, నేను చేసిన భాగమతి తర్వాత చాలా అలసిపోయాను అందుకే అపుడు కాస్త విరామం తీసుకుందాం అనుకున్నాను. అలా బ్రేక్ తర్వాత నిశ్శబ్దం స్క్రిప్ట్ విని అది డిసైడ్ అయ్యాను.

 

నిశ్శబ్దం సినిమా ఒప్పుకునేలా చేసింది ఏంటి?ఆ ఛాలెంజింగ్ రోల్ కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు?

హేమంత్ నాకు కథ చెప్పిన విధంగా బాగా నచ్చింది. అతని విజన్ మరియు చెప్పిన విధానం కొత్తగా అనిపించాయి. అందుకే అలా ఈ సినిమాను ఒకే చేసేసాను. ఈ చిత్రంలో ఒక మూగమ్మాయి రోల్ లో కనిపిస్తాను అందుకోసం సైన్ బాషను కూడా నేర్చుకొన్నారు. నిజంగా మాటలు రాని వారు ఎలా చేస్తారో అలా ప్రిపేర్ అయ్యి చేశాను. దీనికి దాదాపు రెండు నెలలు ట్రైనింగ్ తీసుకున్నాను.

 

ఈ చిత్రంలో మీకు బాగా థ్రిల్ అనిపించిన అంశం ఏమిటి?

యూఎస్ లో షూటింగ్ అందులోను మాధవన్ లాంటి నటుడితో చేయడం నాకు బాగా థ్రిల్ అనిపించింది. పదమూడేళ్ల తర్వాత ఆయనతో వర్క్ చేశాను ఆ అనుభవం చాలా బాగా అనిపించింది. అలాగే హాలీవుడ్ స్టార్ మైఖేల్ మాడిసన్ తో చెయ్యడం కూడా సెట్స్ లో ఒక కొత్తరకమైన థ్రిల్ ను ఇచ్చాయి.

 

సినిమాలో ఈ మాటలు రాని అమ్మాయి కాన్సెప్ట్ ఏమిటి?

ఇది అందరి అమ్మాయిల లాంటి రోల్ లా ఉండదు. మాటలు రాని అమ్మాయిలా నటించడం చిన్న విషయం కూడా కాదు. ఈ సినిమాలో ఉండే మిగతా పాత్రలతో కలిసి ఈ మాటలు రాని అమ్మాయి ఎలా సర్వైవ్ అయ్యింది అన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.

 

ఓటిటి రిలీజ్ అని బాధపడుతున్నారా?

ఒకరకంగా చెప్పాలి అంటే నిజమే. నేను కూడా సినిమాను థియేటర్స్ లోనే చూసి ఎక్కువ ఎంజాయ్ చేస్తాను థియేటర్ లో జరిగే ప్రతి అంశాన్ని ఆస్వాదిస్తాను. అలా అని ఓటిటి రిలీజ్ కూడా మంచిది కాదు అని చెప్పను. నిర్మాతలు సేఫ్ అవ్వడానికి మంచి మార్గం సో నాకెలాంటి కంప్లైంట్స్ లేవు.

 

మీ అన్ని సినిమాలలో మీ పేరే ఎక్కువగా వినిపిస్తుంది, అది ఎలా ఉంటుంది?

అది బాగానే అనిపిస్తుంది కానీ ఒక సినిమా తీయడం అనేది వన్ మ్యాన్ షో కాదు అదంతా ఒక టీం వర్క్ మాత్రమే. నిశ్శబ్దం విషయానికి వస్తే నాకు మాత్రమే కాకుండా మొగత అందరి నటులకి కూడా సాలిడ్ రోల్స్ ఉన్నాయి. అవెలా ఉంటాయో రేపు సినిమాలో మీరు కూడా చూస్తారు.

 

ఈ లాక్ డౌన్ లో ఏం చేసారు?

ముందుగా నాకు నేను ఎక్కువగా సమయాన్ని ఇచ్చుకున్నాను. అలాగే చాలా సినిమాలు చూసాను, కథలు విన్నాను, ఒక రెండు చిత్రాలను కూడా సైన్ చేశాను వాటి వివరాలు తొందరలోనే తెలుపుతాను.

 

ఇప్పటి వరకు మీ జర్నీ కోసం అడిగితే ఏం చెప్తారు?

సూపర్ చిత్రం నుంచి ఇపుడు నిశ్శబ్దం వరకు అంతా మంచి మనుషులతో పని చెయ్యడం అదృష్టంగా అనుకుంటాను. అలాగే అరుంధతి తర్వాత నుంచి చాలా మార్పు తెచ్చింది. ఏదైనా సరే నా అభిమానులు నన్ను నమ్మిన దర్శకులు నిర్మాతలు లేకపోతే నేనూ లేను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు