ఇంటర్వ్యూ : సిమ్రాత్ కౌర్ – “డర్టీ హరి”తో నా లైఫ్ లోకి ఎం ఎస్ రాజు గారు ఒక దేవదూతలా వచ్చారు

ఇంటర్వ్యూ : సిమ్రాత్ కౌర్ – “డర్టీ హరి”తో నా లైఫ్ లోకి ఎం ఎస్ రాజు గారు ఒక దేవదూతలా వచ్చారు

Published on Dec 15, 2020 2:05 PM IST

మన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎం ఎస్ రాజు పలు చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అలా తాను చేసిన లేటెస్ట్ బోల్డ్ అటెంప్ట్ చిత్రం “డర్టీ హరి”. ఇక ఈ చిత్రం వచ్చే డిసెంబర్ 18న సరికొత్త స్ట్రీమింగ్ యాప్ ఫ్రైడే మూవీస్ లో విడుదల కానున్న సందర్భంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన సిమ్రాత్ కౌర్ నుంచి ఓ ఇంటర్వ్యూ తీసుకున్నాం మరి ఆమె ఎలాంటి విషయాలను పంచుకుందో ఇప్పుడు చూద్దాం.

ఈ సినిమాలో మీ రోల్ కోసం చెప్పండి?

ఈ సినిమాలో నేను జాస్మిన్ అనే అమ్మాయ్ రోల్ లో కనిపిస్తాను. చాలా కాన్ఫిడెంట్ అండ్ బోల్డ్ గా తన రోల్ ఉంటుంది. అలాగే పర్సనల్ గా ఈ రోల్ నాకు చాలా దగ్గరగా అనిపించింది. నేను చేసిన మొదటి సినిమా “ప్రేమతో మీ కార్తీక్” లో పూర్తిగా ఫ్యామిలీ అమ్మాయి రోల్ లో కనిపించా కానీ ఇందులో దానికి పూర్తి డిఫరెంట్ గా కనిపిస్తాను.

ఈ జాస్మిన్ రోల్ ను ఒప్పుకొనేలా ఏది కారణం అయ్యింది?

నేను ముంబైలో ఉన్నప్పుడు ఎం ఎస్ రాజు గారు కాల్ చేసి మాట్లాడారు. అప్పుడే ఒక గూగుల్ లో తన పేరు సెర్చ్ చెయ్యమన్నారు, అప్పుడు చూసి ఇంత పెద్ద ప్రొడ్యూసర్ కం డైరెక్టర్ నాకు కాల్ చెయ్యడం ఏంటి అని, అలా ఆయన హైదరాబాద్ రమ్మన్నారు స్క్రిప్ట్ వినిపించారు. అప్పుడు ఈ స్క్రిప్ట్ అసలు రొటీన్ కాదు చాలా కొత్తగా అనిపించింది. అలాగే ఈ జాస్మిన్ అనే రోల్ కోసం నాకు చెప్పిన విధానం నటిగా చాలా నచ్చింది. అందుకే ఇలాంటి రోల్ ను నేను ఒప్పుకున్నాను.

ఇది మీకు బోల్డ్ డెసిషనా మంచి డెసిషనా.?

నా వరకు వస్తే ఇది మంచి డెసిషనే అని చెప్తాను. ఎందుకంటే ఒక నటిగా కేవలం ఒకేలాంటి రోల్స్ చేస్తే ఇలాంటి వాటికోసం ఏమి తెలుసుకోలేం అందుకే మరిన్ని రోల్స్ చెయ్యడానికి ఇంకా కొత్త విషయాలను నేర్చుకోడానికి ఇది మంచి నిర్ణయమే అని చెప్తాను.

ఇంతకు ముందు మీరు ఓసారి సినిమాలు చెయ్యను అని చెప్పేసారు.?

హా అవును, పరిచయం సినిమా తర్వాత అసలు సినిమాలు చెయ్యకూడదు అనే అనుకున్నాను. ఎందుకంటే ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డాను,పైగా పర్సనల్ లైఫ్ లో నేను చాలా ఎమోషనల్. వీటితో పాటు నా స్టడీస్ మధ్యలోనే ఆపేసి సినిమాల్లోకి వచ్చాను, సినిమాల్లో ఇప్పుడు ఒకలా ఉన్నరోజు రేపు ఎలా ఉంటుందో కూడా చెప్పలేం ఆ టైం లో మళ్ళీ చదువా, సినిమాలా అన్న డైలమాలో ఉన్నపుడు మా ఫామిలీ కూడా చాలా సపోర్ట్ చేసారు. సరిగ్గా ఆ సమయంలో ఈ సినిమా స్క్రిప్ట్ తో ఎం ఎస్ రాజు గారు ఒక ఏంజెల్(దేవదూత) లా వచ్చారు. సో మళ్ళీ సినిమా స్టార్ట్ చేశాను.

ఎం ఎస్ రాజు గారితో వర్క్ ఎలా ఉంది?

ఆయన ఇప్పటికే చాలా పెద్ద నిర్మాత. ప్రభాస్, మహేష్ లాంటి హీరోలతోనే చేశారు. మరి అలాంటి వ్యక్తితో ఓ సినిమా చెయ్యడం అనేదే చాలా గొప్ప విజయం అనుకుంటాను. ఆయన ఏజ్డ్ అయ్యినప్పటికీ చాలా కూల్ గా ఉంటారు. అలాగే కొన్ని ముద్దు సీన్స్ ను ఆయన వివరించిన విధానం నటనలో అలాగే పర్సనల్ లైఫ్ లో కూడా చాలా నేర్పించారు.

మరి ఇలాంటి సినిమా ఒప్పుకున్నపుడు మీ అమ్మగారు ఏమన్నారు?

ఎం ఎస్ రాజు గారు నాకు కొన్ని కిస్ సీన్స్ కోసం చెప్పినపుడు ఓకే అనుకున్నాను, కానీ నేను మా ఫ్యామిలీ ని అడగాలని చెప్పను. అలా మా అమ్మని అడుగుదాం అంటే తాను ఖచ్చితంగా ఒప్పకోదు అనే అనుకున్నాను, కానీ ఈరోజుల్లో ఇలాంటి సీన్స్ అన్ని ఇండస్ట్రీల్లో ఉన్నాయి, మనం ఒక రూట్ ఎంచుకొన్నపుడు ఇలాంటివి ఉంటాయి కానీ నా నటనకు, పాత్రకు స్కోప్ ఉంటే ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు.

ఈ సినిమాని మార్చ్ లో ప్లాన్ చేశారు, కానీ ఇప్పుడిలా అవుతుంది దీనిపై మీ ఏమనిపిస్తుంది?

అనుకోకుండా వచ్చిన కోవిడ్ చాలానే మార్చేసింది. ఒక్క మా సినిమానే కాదు మొత్తం సినీ ప్రపంచాన్నే.. ఈ సినిమాని మేము 2019 డిసెంబర్ లోనే పూర్తి చేసేసాం. అప్పుడు ముందు ఫెబ్ 14న ప్లాన్ చేసాం కానీ కొన్ని కారణాల వల్ల అది అవ్వలేదు తర్వాత మార్చ్ లో ప్లాన్ చేసాం కానీ అప్పుడు లాక్ డౌన్ పెట్టేసరికి అలా ఆగిపోయింది. అప్పుడు అంటే సేఫ్టీ కోసం థియేటర్స్ కు రాలేదు కానీ ఇప్పుడు ఎనీ టైం థియేటర్స్(ఏటిటి) లో మా సినిమా వస్తున్నందుకు బాగానే అనిపిస్తుంది.

ఎలాంటి రోల్స్ చెయ్యాలి అనుకంటున్నారు?

ఓ నటిగా అయితే ఎలాంటి రోల్ అయినా చేస్తా అని చెప్తాను కానీ నా డ్రీం రోల్ అయితే ఒక స్పోర్ట్స్ రోల్ లో చెయ్యాలి అని ఉంది. ఎందుకంటే స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచే నేను కూడా వచ్చాను. కరాటేలో నాకు గోల్డ్ మెడల్ కూడా ఉంది. మా అమ్మానాన్నలు కూడా ఒలంపిక్ ప్లేయర్స్ సో అలాంటి రోల్స్ లో చెయ్యాలి అనుకుంటున్నాను.

ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా?

ప్రస్తుతానికి అయితే మంచి స్క్రిప్ట్స్ కోసం చూస్తున్నాను. మంచి కంటెంట్, స్టోరీస్ టాలీవుడ్ లో వస్తున్నాయి. ఇంకా అయితే ఏది ఫిక్స్ అవ్వలేదు.

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు