ప్రత్యేక ఇంటర్వ్యూ : వెంకట్ – నా కెరీర్ ని ‘ఆ ఐదుగురు’ మలుపు తిప్పుతుంది.

venkat
డైరెక్టర్ వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’ సినిమా ద్వారా పరిచయమైన తెలుగు హీరో వెంకట్. ఇప్పటి వరకూ తన కెరీర్లో కొన్ని మంచి సినిమాలు చేసిన వెంకట్ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ లాంటి హీరోలతో సహా సినిమాలు చేసాడు. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన వెంకట్ మళ్ళీ ‘ఆ ఐదుగురు’ సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సందర్భంగా వెంకట్ తో కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించాం. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) ఎందుకు మీరు సినిమాకి సినిమాకి మధ్య ఇంత గ్యాప్ తీసుకున్నారు?

స) ‘సలీం’ సినిమా చేసిన తర్వాత నాకు వచ్చిన ఆఫర్స్ ఏవీ అంత ఆసక్తికరంగా లేవు. అందుకే కాస్త బ్రేక్ తీసుకున్నాను. నా ఇంటీరియర్ బిజినెస్ లో బిజీగా ఉన్నాను. కానీ ఇప్పటికీ నన్ను అభిమానులు గుర్తు పెట్టుకోవడం వలన ఇకపై నేను ఇండస్ట్రీలోనే కొనసాగాలనుకుంటున్నాను.

ప్రశ్న) ‘ఆ ఐదుగురు’ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి?

స) ఈ సినిమాలో ఓ సిన్సియర్ ఐపిఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాను. నాకున్న లవర్ బాయ్ ఇమేజ్ ని మైండ్ లో పెట్టుకొని ఈ సినిమా చేయడం చాలెంజింగ్ గా అనిపించింది. మొదటి సారి నేను అవుట్ అండ్ అవుట్ టఫ్ రోల్ చేశాను. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను, చెప్పాలంటే పోలీస్ అకాడమీలో రెండు నెలలు స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను.

ప్రశ్న) ఈ సినిమాలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఆడియన్స్ చూడటానికి ఈ సినిమాలో ఏముంది?

స) మీరు టైలర్స్ చూస్తేనే చెప్పొచ్చు. ఇదొక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అని. ఇందులో నా పాత్ర కూడా ఒకటి. సొసైటీకి మంచి చేయడం కోసం యంగ్ స్టర్స్ ని ట్రైన్ చేసే పాత్రలో కనిపిస్తాను.

ప్రశ్న) ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపిస్తున్నారు? అది ముందే ప్లాన్ చేసుకొని చేసారా?

స) అవును. ఇప్పటి వరకూ నన్ను ప్రేక్షకులు లవర్ బాయ్ ఇమేజ్ లోనే చూసారు. ఈ ఇమేజ్ నుంచి బయటకి వచ్చి చేసిన సినిమా ఇది. అలాగే నా పాత్రకి అవసరం కాబట్టి ఇలా కొత్త లుక్ లో కనిపించాను. ఈ లుక్ ని నాకు నేనే డిజైన్ చేసుకున్నాను.

ప్రశ్న) ఈ కంబ్యాక్ మూవీ విషయంలో ఏమన్నా నర్వస్ గా ఫీలవుతున్నారా?

స) ఈ సినిమా టాలీవుడ్ లో నా ఇమేజ్ ని చాలా మార్చేస్తుంది. ఈ సినిమా రిలీజ్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. అలాగే ఈ సినిమా నా కెరీర్లో మార్పు తీసుకొచ్చి నాకొక బ్రేక్ ఇస్తుందని ఆశిస్తున్నాను.

ప్రశ్న) మీరు గతంలో ఎఎన్ఆర్, చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ నటీనటులతో పనిచేసారు. మొదటిసారి కొత్త వాళ్ళతో పనిచేయడం ఎలా ఉంది?

స) ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడొస్తున్న యంగ్ స్టర్స్ అందరూ బాగా ట్రైన్ అయ్యి వస్తున్నారు. అలాగే వాళ్ళు కెమెరా ముందు చాలా ఈజ్ తో నటిస్తున్నారు.

ప్రశ్న) ఇకపై మీరు క్యారెక్టర్ రోల్స్ చేయడానికి సిద్దమేనా?

స) అవును.. క్యారెక్టర్ రోల్స్ చేస్తాను, అలా అని నా దగ్గరికి వచ్చిన అన్ని ఆఫర్స్ ని ఓకే చెయ్యను. నా పాత్రకి కథలో ప్రాముఖ్యత ఉండాలి, అప్పుడే చేస్తాను.

ప్రశ్న) మీరు తర్వాత పని చేయనున్న సినిమాలు ఏమిటి?

స) ప్రస్తుతానికైతే నా చేతిలో ఉన్న సినిమా ఇదొక్కటే.. ఈ సినిమాకి వచ్చే రెస్పాన్స్ ని బట్టి నా తదుపరి సినిమాలను ఎంచుకుంటాను.

ప్రశ్న) మీ కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి ఇండస్ట్రీలో మీరు ఎలాంటి మార్పులు చూసారు.?

స) ఇండస్ట్రీకి మంచి జరిగేలానే చాలా మార్పులు వచ్చాయి. ఇంకా ఎక్కువ మల్టీ స్టారర్ సినిమాలు టాలీవుడ్ లో రావాలని ఆశిస్తున్నాను. అలా వస్తేనే కొత్త కథలు వస్తాయి, అప్పుడే నా లాంటి నటులకి మంచి పాత్రలు చేసే అవకాశం వస్తుంది.

అంతటితో మా ఇంటర్వ్యూని ముగించి ‘ఆ ఐదుగురు’ సినిమా హిట్ అయ్యి వెంకట్ కి మరిన్ని ఆఫర్స్ తీసుకురావాలని అల్ ది బెస్ట్ చెప్పాము.

CLICK HERE FOR ENGLISH INTERVIEW

Exit mobile version