ఇంటర్వ్యూ : సూర్య – “ఆకాశం నీ హద్దురా” చేసేటప్పుడు నా కెరీర్ మొదట్లో పడ్డ ఇబ్బందులు గుర్తొచ్చాయి

ఇంటర్వ్యూ : సూర్య – “ఆకాశం నీ హద్దురా” చేసేటప్పుడు నా కెరీర్ మొదట్లో పడ్డ ఇబ్బందులు గుర్తొచ్చాయి

Published on Oct 29, 2020 5:30 PM IST

తమిళ్ మన తెలుగులో మోస్ట్ లవబుల్ హీరో అయినటువంటి సూర్య హీరోగా నటించిన “ఆకాశం నీ హద్దురా” కోసం చాలా కాలం నుంచి అంతా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ నవంబర్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది. మరి ఈ సందర్భంగా ఇంటర్వ్యూ ఓ ఇంటర్వ్యూను తీసుకున్నాం. మరి సూర్య ఎలాంటి విషయాలను పంచుకున్నారో చూద్దాం.

ఈ సినిమా ఒప్పుకోడానికి గల కారణం ఏమిటి?

క్యాప్టెన్ గోపినాథ్ గారి జీవిత కథ చాలా ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది అది మరో మాట నా మైండ్ లో లేదు. కానీ ఆయన జీవితం ఎంత ప్రేరేపించేలా ఉంటుందో అంతే వివాదాలతో కూడా కోరుకుంది. వాటిలో నేను సుధా ఏ అంశాన్ని తీసుకొని చూపించాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అనుకున్నాను. అలా ఒక్కసారి స్క్రిప్ట్ విన్నాక ఇక మరేదీ ఆలోచించకుండా ఓకే చేసేసాను.

ఇది బయోపిక్ లాంటి సినిమా, దీనికి ఎలా ప్రిపేర్ అయ్యారు?

మొదటగా ఈ స్క్రిప్ట్ చదివినప్పుడే చాలా కొత్తగా ఇంతకు ముందు ఎప్పుడు లేని అనుభూతిని కలిగించింది. అలాగే సుధా కూడా ఒక్కో రోల్ ను చక్కగా రెడీ చేశారు. వీటితో పాటుగా మిగతా నటులు కూడా స్క్రిప్ట్ చదివే సమయంలో ఉన్నారు సో అంతా ఈజీ అయ్యింది. అలాగే మెయిన్ గా సుధా కు ఉన్న విజన్ నన్ను మరింత పని చేసేలా చేసింది.

సుధా కొంగర తో పనితనం ఎలా అనిపించింది?

నాకు సుధా ఎప్పటి నుంచో తెలుసు. చాలా చిత్రాలకు పని చేసాం కూడా, అయితే ఒక సమయంలో నేను ఓ సీన్ చేస్తున్నప్పుడు నా మొహం మీదే ఆ సీన్ మీరు బాగా చెయ్యలేదు దాన్ని ఇంకా బాగా చెయ్యగలరు అన్నారు. అప్పడే ఆమె ముక్కుసూటితనం నచ్చింది. సో ఇవన్నీ ఆమెతో ఈ ప్రాజెక్ట్ చెయ్యడానికి హ్యాపీగా హెల్ప్ అయ్యాయి.

మోహన్ బాబు గారితో వర్క్ ఎలా ఉంది?

నేనెప్పుడూ ఆయనతో వర్క్ చేస్తానని అసలు ఊహించలేదు. ఆయన పేరు మొదట అనుకోని ఆయన్ను అప్రోచ్ అయ్యినప్పుడు ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చేసేసారు. అలాగే సెట్స్ లో కూడా చాలా కామ్ గా ఉంటారు. అంతే కాకుండా షాట్ అయ్యాక తన తమిళ్ డిక్షన్ సరిగ్గా వచ్చిందా లేదా కూడా చెక్ చేసుకుంటారు. అలాంటి ఆయన సింపుల్ గా ఉండే హుందాతనం ఈ చిత్రానికి పెద్ద ఎసెట్ అయ్యింది.

పర్సనల్ గా ఈ సినిమా మీకు ఎలా కనెక్ట్ అయ్యింది?

క్యాప్టెన్ గోపినాథ్ గారి జీవితంలో కొన్ని అంశాలు చాలా లోతుగా ఉంటాయి. బెంగళూర్ లోని ఆయన్ను వారి ఇంట్లో నేను మరిన్ని విషయాలను తెలుసుకోడానికి కలిసాను. తర్వాత చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా ఈ సినిమా నేను నా కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న సవాళ్లు నా సొంత సంపాదన సంపాదించుకునే సమయంలో పడ్డ ఇబ్బందులు గుర్తు చేసింది.

ఓటిటి రిలీజ్ అనేది మీకు ఎలా అనిపిస్తుంది.?

ఈ సినిమా క్లియర్ గా వెండితెర పై చూసే విధంగానే తెరకెక్కించబడింది. లాక్ డౌన్ వచ్చాక పరిస్థితులు సర్దుకుంటాయేమో అని చాలా కాలం ఓపికగా ఎదురు చూసాం. మా డైరెక్టర్ సుధాకు ఈ స్మాల్ స్క్రీన్ రిలీజ్ అసలు ఇష్టం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు, నిర్మాతగా నేను, సినిమాతో ముడిపడి ఉన్న అనేక అంశాలు ఈ చిత్రాన్ని ఓటిటి రిలీజ్ కు దారి తీశాయి. కానీ ప్రపంచ వ్యాప్తంగా మరింత మందికి ఈ చిత్రం అందుబాటులోకి ఇపుడు వస్తుండడం నాకు కాస్త ఆనందంగా ఉంది.

జ్యోతిక గారి సెకండ్ ఇన్నింగ్స్ ను మీరెలా చూస్తున్నారు?

ఇప్పుడు ఆమెకు మంచి రోల్స్ వస్తున్నాయి. వాటిలో తాను బెస్ట్ ను ఎంచుకొంటుంది. ఇలా ఒక నటికి జరగడం చాలా అరుదు. ఇప్పుడు తాను చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది. తనకి ఎప్పుడూ అండగా ఎలాంటివో పరిస్థితుల్లో అయినా సపోర్ట్ గా నేనుంటాను.

సూర్య పెర్ఫామెన్స్ పై సుధా కొంగర గారి టేక్ కూడా చూద్దాం..

ఈ ఇంట్రాక్షన్ సుధా కూడా పాల్గొన్నారు. సూర్య రోల్ ను ఎలా తీర్చిదిద్దారో కూడా వివరించారు. సుధా ఈ రోల్ కోసం ఆలోచించినప్పుడు ఒక్క సూర్య మాత్రమే తన మైండ్ లో మెదిలాడని తెలిపారు. అతను సెట్స్ లో గడిపిన విధంగా పండించిన ఎమోషన్స్ ఖచ్చితంగా అందరిని మెప్పిస్తాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసారు.

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు