
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తీసిన భారీ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. కృతి సనన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ భారతీయ ఇతిహాసగాథ రామాయణం ఆధారంగా తెరకెక్కింది. ఇక ఆదిపురుష్ లో ప్రభాస్ రాఘవ గా కృతి సనన్ జానకి గా నటిస్తుండగా శేషు గా సన్నీ సింగ్, భజరంగీ గా దేవదత్త నాగే కనిపించనున్నారు. అలానే కీలకమైన లంకేశ్ పాత్రలో సైఫ్ ఆలీ ఖాన్ నటించగా దీనిని రిట్రో ఫైల్స్, టి సిరీస్ ఫిలిమ్స్ సంస్థలు నిర్మించాయి.
ఇక ఆదిపురుష్ నుండి ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, రెండు ట్రైలర్ లు అందినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మొన్న రిలీజ్ అయిన ఫైనల్ ట్రైలర్ లో యాక్షన్, విజువల్ అంశాలు మరింతగా ఆకట్టుకోవడంతో అవి మూవీ పై ఉన్న అంచనాలు అమాంతం పెంచేసాయి. మొత్తంగా అయితే ఆదిపురుష్ మూవీ పై ప్రస్తుతం అంచనాలు అంతకంతకూ పెరగడంతో జూన్ 16న గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్ ముందుకి రానున్న తమ మూవీ తప్పకుండా అంచనాలకి మించి ఆకట్టుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

