ఇటీవల ‘దుమ్ము ..ధూళి’ అంటూ ఓ మాస్ పాటతో ఫ్యాన్స్ గుండెల్లో జోష్ నింపారు సూపర్ స్టార్ రజిని కాంత్. తాను నటిస్తున్న తాజా చిత్రం దర్బార్ చిత్రంలోని మొదటి సాంగ్ గా వచ్చిన ‘దుమ్ము… ధూళి’ అలరించింది. రెండు దశాబ్దాల క్రితం రజిని నటించిన బ్లాక్ బస్టర్ మూవీస్ అరుణాచలం , నరసింహ వంటి చిత్రాలలోని రజిని ఇంట్రో సాంగ్ ని మరిపించేలా ఉన్న ఈ సాంగ్ అద్భుతంగా ఉంది. రజిని మేనరిజం స్టైల్ కి తగ్గట్టుగా అనిరుధ్ ఈ పాటను స్వరపరచగా బాల సుబ్రహ్మణ్యం తన అనుభవంతో పాటకు మంచి కిక్ యాడ్ చేశారు.
కాగా నేడు ఈ మూవీ ఆడియో విడుదల వేడుక చెన్నైలో గ్రాండ్ గా జరగనుంది. మొదటి పాటతోనే అంచనాలను పెంచేసిన నేపథ్యంలో అనిరుధ్ స్వరపరిచిన ఫుల్ ఆడియో ఆల్బమ్ ఏ రేంజ్ లో ఉంటుందో అని అందరిలో ఆసక్తి నెలకొంది. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్బార్ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. జనవరి 15న సంక్రాంతి కానుకగా దర్బార్ విడుదల కానుంది. రజిని ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా నటిస్తున్నారు.