నాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా యంగ్ దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన ఓ బ్యూటిఫుల్ ఎమోషనల్ రైడ్ చిత్రమే “హాయ్ నాన్న”. మరి మొదటి నుంచీ మంచి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం విషయంలో నాని సహా మేకర్స్ కూడా చాలా కాన్ఫిడెన్స్ గా ఉండగా అసలు వారు ఎందుకు తమ కంటెంట్ పట్ల ఎందుకు అంత నమ్మకం గా ఉన్నారు అనేది నిన్న ట్రైలర్ తో ప్రూవ్ అయ్యింది.
నాని నుంచి మరోసారి ఒక కదిలించే సినిమా వస్తున్నట్టుగా ట్రైలర్ చూసాక కన్ఫర్మ్ అయ్యిపోయింది. మరి సినిమా కూడా అంచనాలు అందుకునే లెవెల్లో ఉంటే నాని తన కెరీర్ బెంచ్ మార్క్ చిత్రం మంచి మైల్ స్టోన్ సినిమాగా నిలుపుకుంటారు అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి హీషం అబ్దుల్ వహాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.