“ఎఫ్ 3” ఓటిటి రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన సమ్మర్ సోగ్గాళ్లు.!


లేటెస్ట్ గా మన టాలీవుడ్ నుంచి వచ్చిన సమ్మర్ సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “ఎఫ్ 3”. సమ్మర్ సోగ్గాళ్లుగా విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు హీరోలుగా తమన్నా మరియు మెహ్రీన్ లు హీరోయిన్స్ గా నటించారు. అయితే ఈ చిత్రం ఇప్పుడు థియేటర్స్ లో భారీ రెస్పాన్స్ మరియు వసూళ్లతో సాలిడ్ రన్ ని కనబరుస్తుంది.

అయితే ఇప్పుడున్న రోజుల్లో దాదాపు నెల రోజుల్లోనే సినిమాలు ఓటిటి లో వచ్చేస్తుండగా దీనిపై కూడా చాలా మంది అలాగే అనుకోవచ్చు కానీ ఇప్పుడు స్వయంగా మేకర్స్ ఈ సినిమా ఓటిటి రిలీజ్ పై లేటెస్ట్ క్లారిటీ ఇచ్చేసారు. ఈ సినిమా రిలీజ్ అయ్యిన నాటి నుంచి 8 వారాల వరకు అయితే ఓటిటి లో రాదనీ దర్శకుడు అనీల్ రావిపూడి అలాగే హీరోలు వెంకీ మామ మరియు వరుణ్ తేజ్ లు క్లారిటీ ఇచ్చారు.

సో అప్పటి వరకు ఆగాల్సిందే. ఆ లోపు థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చెయ్యాల్సిందే. మరి ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Exit mobile version