“ఎఫ్ 3” ఏపీ/తెలంగాణలో డే 1 వసూళ్ల డీటెయిల్స్ ఇవే.!

Published on May 28, 2022 3:00 pm IST

విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు హీరోలుగా దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కించిన క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “ఎఫ్ 3”. మన టాలీవుడ్ లోనే ఒక బిగ్గెస్ట్ ఫన్ ఫ్రాంచైజ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నిన్న మంచి అంచనాలు నడుమ రిలీజ్ అయ్యింది. అయితే అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మరియు ఓవర్సీస్ లో మంచి ఓపెనింగ్స్ ని ఈ సినిమా అందుకుంది. ఇక ఏపీ మరియు తెలంగాణాలో ఏరియాల వారీగా ఈ చిత్రం షేర్ వసూళ్ల డీటెయిల్స్ చూసినట్టు అయితే..

నైజాం – 4.06 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.18 కోట్లు
గుంటూరు – 88 లక్షలు
నెల్లూరు – 62 లక్షలు
తూర్పు గోదావరి – 76 లక్షలు
వెస్ట్ గోదావరి – 94 లక్షలు
కృష్ణ – 67 లక్షలు
సీడెడ్ – 1.26 కోట్లు

మొత్తం ఫస్ట్ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 10.37 కోట్లు షేర్ ని రాబట్టింది. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందివ్వగా దిల్ రాజు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :