Pushpa 2: ‘పుష్ప-2’ కోసం బిజీ అయిన ఫహాద్ ఫాజిల్

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ సీక్వెల్ మూవీ ‘పుష్ప-2’ కోసం అభిమానులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తుండటంతో ఈ మూవీ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండగా, ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ అనే పాత్రలో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆయన ఈ సీక్వెల్ చిత్రంలో నటించేందుకు గతంలోనే బల్క్ డేట్స్ ఇచ్చాడు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ సమయంలో షూటింగ్ జరగలేదు. దీంతో ఇప్పుడు ఏకధాటిగా ‘పుష్ప-2’ సినిమా షూటింగ్‌లో ఈ యాక్టర్ బిజీ అయ్యాడు. ఆయనకు సంబంధించిన కీలక సన్నివేశాలన్నీ కూడా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.

ఇక ఈ షూటింగ్‌లో అల్లు అర్జున్ కూడా పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది. దీంతో వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ పీక్స్‌లో ఉండబోతున్నాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 6న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

Exit mobile version