“పుష్ప” తో నాకు వచ్చిందేమీ లేదు – ఫహద్ షాకింగ్ కామెంట్స్ వైరల్


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ బి తెరకెక్కిస్తున్న అవైటెడ్ సీక్వెల్ చిత్రం “పుష్ప 2” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంకి ముందు వచ్చిన పార్ట్ 1 పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి హిట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో చివరి పావుగంట మరో లెవెల్ విలనిజాన్ని చూపించిన టాలెంటెడ్ నటుడు ఫహద్ ఫాజిల్ కి కూడా మంచి మార్కులు పడ్డాయి.

అయితే అసలు పుష్ప అనే సినిమా వల్ల తనకేమి ఒరిగింది పెద్దగా ఏది లేదు అని ఫహద్ లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ షాకింగ్ గా మారి వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకి కేరళ దాటి పుష్ప మూలాన ఎక్కువ క్రేజ్ వచ్చిందా అంటే లేదు అనే చెప్తాను, అలా అని నేను ఎవరినీ తప్పు పట్టడం లేదు.

ఆ విషయం నేను సుకుమార్ గారికి కూడా చెప్పాను పుష్ప అనే సినిమా కేవలం సుకుమార్ గారి మీద ఉన్న ప్రేమ, గౌరవం తోనే చేశాను అని తెలిపాడు. అలాగే తన మొదటి ప్రియారిటీ ఎప్పటికీ మళయాళ సినిమానే ఉంటుంది అని తెలిపాడు. అయితే పుష్ప మూలాన కేరళ దాటి ఫహద్ మన తెలుగు స్టేట్స్ లో బాగా వినిపించాడు.

తన స్టేట్మెంట్ కొంతమందికి నొప్పించి ఉండొచ్చు కానీ తనకి అనిపించింది తాను చెప్పాడు పైగా సుకుమార్ తో కూడా అన్నానని తెలిపాడు. మరి తాను అనుకున్న క్రేజ్ ఇప్పుడు పుష్ప 2 తో మరింత వస్తుంది అని మాత్రం డెఫినెట్ గా చెప్పవచ్చు.

Exit mobile version