ప్రభాస్, హను ప్రాజెక్టుపై అవి ఫేక్ వార్తలు.!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో రీసెంట్ గా అనౌన్స్ చేసిన భారీ పీరియాడిక్ చిత్రం ప్రభాస్ హను రాఘవపూడి ప్రాజెక్ట్ కూడా ఒకటి. మరి ఈ సినిమాపై కూడా ఆడియెన్స్ లో మంచి హైప్ నెలకొనగా ఈ సినిమాని కూడా ప్రభాస్ స్టార్ట్ చేసేయనున్నాడు. అయితే ఈ సినిమాపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ గా మారింది.

ఈ సినిమాకి మేకర్స్ ప్రస్తుతం భారీ సెట్టింగ్స్ వేస్తున్నట్టుగా పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. అవి కేవలం ఫేక్ వార్తలు మాత్రమే అని కన్ఫర్మ్ అయ్యింది. సినిమాకి వర్క్ చేస్తున్న ఓ అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టిన పిక్స్ చూసి చాలా మంది ప్రభాస్ హను సినిమా సెట్స్ అనుకున్నారు కానీ అవి ఆ సినిమా సెట్టింగ్స్ కాదు అని తేల్చేసాడు. సో ఈ సినిమాపై వైరల్ అవుతున్న ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాలి.

Exit mobile version