విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ల క్రేజీ కాంబినేషన్ లో యువ దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీ నుండి కల్యాణి వచ్చా వచ్చా అనే పల్లవితో సాగే మంచి డ్యాన్స్ నెంబర్ ని తాజాగా రిలీజ్ చేసారు మేకర్స్.
మంగ్లీ, కార్తీక్ అద్భుతంగా పాడిన ఈ సాంగ్ కి విజయ్, మృణాల్ ఇద్దరూ కూడా స్టెప్స్ అదరగొట్టారు. కాగా ప్రస్తుతం ఈ లిరికల్ సాంగ్ వీడియో యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. గీతా గోవిందం అనంతరం, విజయ్ పరశురామ్ ల కాంబినేషన్ లో వస్తున్న ఫ్యామిలీ స్టార్ కూడా మంచి విజయం అందుకుంటుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ మూవీ ఏప్రిల్ 5 న విడుదల కానుంది.
సాంగ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి