మా మూవీకి ‘ఫ్యామిలీ స్టార్’ టైటిల్ ఫస్ట్ చాయిస్ కాదు – విజయ్ దేవరకొండ

మా మూవీకి ‘ఫ్యామిలీ స్టార్’ టైటిల్ ఫస్ట్ చాయిస్ కాదు – విజయ్ దేవరకొండ

Published on Apr 2, 2024 9:53 PM IST

యువ నటుడు విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్, దీనిని పరశురామ్ పెట్ల తెరకెక్కించగా ఏప్రిల్ 5న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీ యొక్క ప్రమోషన్స్ లో భాగంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, తమ మూవీకి టైటిల్ గా ఫస్ట్ చాయిస్ ఫ్యామిలీ స్టార్ కాదని అన్నారు.

మూవీలో తన క్యారెక్టర్ పేరు గోవర్ధన్ విజయ్ అని, దానినే టైటిల్ గా పెడితే ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని భావించాను అన్నారు. అనంతరం టీమ్ తో కలిసి చర్చించి ఫ్యామిలీ స్టార్ టైటిల్ పరిశీలించి ఫిక్స్ చేసి అనౌన్స్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మూవీలో తాము తీసుకున్న కథాంశం ప్రతి ఒక్కరి కుటుంబానికి రిలేట్ అవుతుందని, అలానే మూవీ మంచి సక్సెస్ అవుతుందనే ఆశాభావాన్ని హీరో విజయ్ దేవరకొండ వ్యక్తం చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు