నందమూరి కుటుంబం నుంచి ఓ యువ హీరో రాక కోసం నందమూరి అభిమానులు అంతా ఎంత గానో ఎదురు చూస్తున్నారు. అతడే నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ్య. దాదాపు దశాబ్ద కాలం క్రితమే మోక్షజ్ఞ్య ఎంట్రీ కోసం అభిమానవుల్లో టాక్ వచ్చింది.
కానీ అప్పటికి అతను ఇంకా పిన్న వయస్కుడు కావడం అలాగే చదువుకుంటుండడంతో బాలయ్య దానికి ఇంకా టైం ఉందని తెలిపారు. కానీ ఇప్పుడు తొందరలోనే మోక్షజ్ఞ్య ఎంట్రీ ఉండబోతుంది అన్నట్టుగా తెలుస్తుంది.
అయితే మోక్షజ్ఞ్య ను ఇంట్రో చేసే బాధ్యతలను మాత్రం ప్రముఖ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రాకు అప్పగించినట్టుగా వినికిడి. మరి ఈ కాంబో ఎలా ఉండనుందో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగక తప్పదు.