ప్రముఖ సీరియల్ నటి “పవిత్రా జయరామ్” మృతి!

ప్రముఖ సీరియల్స్ అయిన త్రినయిని, నిన్నే పెళ్ళాడుతా లతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందిన నటి పవిత్రా జయరామ్. ఈ నటి రోడ్డు ప్రమాదం లో మృతి చెందారు. మూడు రోజుల క్రితం షూటింగ్ కోసం బెంగళూరు వెళ్లిన ఈ నటి, తిరుగు ప్రయాణం లో మహబూబ్ నగర్ జిల్లా, శేరిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం కి గురి అయ్యారు. కారు డివైడర్ ను తాకి, ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టడం తో ప్రమాదం చోటు చేసుకుంది.

కారులో కుటుంబ సభ్యులతో పాటుగా, డ్రైవర్ కూడా ఉన్నారు. ప్రమాదం లో తీవ్రం గా గాయపడిన నటిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు, డ్రైవర్ తీవ్రం గా గాయపడ్డారు. ఈమె మరణం పట్ల అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version