సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ టీవి ఛానల్!

నైట్రో స్టార్ సుధీర్ బాబు ప్రధాన పాత్రలో ఇటీవల విడుదలైన తెలుగు చిత్రం హంట్. మహేష్ సూరపనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్ మరియు భరత్ నివాస్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు ఆహా వీడియో లో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంది.

తాజా సమాచారం ఏమిటంటే, ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులు ప్రముఖ టీవీ ఛానెల్ జెమినీ టీవీ వద్ద ఉన్నాయి. ఈ చిత్రం థియేటర్లలో మరియు ఓటిటి లో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version