క‌ల్కి సీక్వెల్ పార్ట్ టైటిల్ ఇదేనా..?

క‌ల్కి సీక్వెల్ పార్ట్ టైటిల్ ఇదేనా..?

Published on Jun 27, 2024 8:00 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన ‘క‌ల్కి 2898 AD’ థియేట‌ర్ల‌లో ల్యాండ్ అయ్యింది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు క్యూ క‌డుతున్నారు. నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గరాసేందుకు రెడీ అయ్యింది. అయితే, ఈ సినిమా రిలీజ్ కు ముందు హీరో ప్ర‌భాస్, ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఇన్స్టా లైవ్ లోకి వ‌చ్చి పలు విష‌యాల‌ను పంచుకున్నారు.

ఈ క్ర‌మంలోనే క‌ల్కి పార్ట్-2 కూడా ఉండ‌బోతుంద‌ని వారి మాట‌ల ద్వారా తెలిసింది. అయితే, ఈ క‌ల్కి పార్ట్-2 కి టైటిల్ పై ఆ లైవ్ లో అభిమానులు చ‌ర్చించారు. క‌ల్కి సీక్వెల్ పార్ట్ కి ఇంట్రెస్టింగ్ టైటిల్ ఉండాల‌ని ఓ అభిమాని సూచించాడు. ‘క‌ల్కి 3102 BC’ అయితే ఆ సీక్వెల్ పార్ట్ కి ప‌ర్ఫెక్ట్ టైటిల్ అని అత‌డు చెపుకొచ్చాడు. ఆ స‌మ‌యంలోనే మ‌హాభార‌తం జ‌రిగింద‌ని.. శ్రీ‌కృష్ణుడు మాన‌వ‌శ‌రీరాన్ని వీడిన సంవ‌త్స‌రం అదేన‌ని.. అప్పుడే క‌లియుగం మొద‌లైంద‌ని స‌ద‌రు అభిమాని వివ‌ర‌ణ ఇచ్చాడు.

దీనికి నాగ్ అశ్విన్ ఇంప్రెస్ కావ‌డం విశేషం. దీంతో, రాబోయే క‌ల్కి పార్ట్-2 సినిమాకు ఈ టైటిల్ పెట్టినా ఆశ్చ‌ర్యప‌డాల్సిన పనిలేద‌ని కొంద‌రు అభిమానులు నెట్టింట ట్వీట్ చేస్తున్నారు. ఏదేమైనా క‌ల్కి మేనియాతో సోష‌ల్ మీడియా ఊగిపోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు