బుజ్జి మరియు భైరవ సిరీస్‌ లోని మిగిలిన ఎపిసోడ్‌ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!

కల్కి చిత్రం వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ మూవీలో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించగా, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె మరియు కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటించారు. సినిమా విడుదలకు ముందు, మేకర్స్ బుజ్జి & భైరవ యొక్క రెండు ఎపిసోడ్‌లను విడుదల చేసారు. బుజ్జి మరియు భైరవ సిరీస్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రత్యేకంగా అందుబాటులో ఉంది. ఈ సిరీస్ కి విశేష స్పందన లభించింది. సినిమా ప్రీమియర్ షో తర్వాత మిగిలిన మూడు ఎపిసోడ్‌లను విడుదల చేస్తామని నాగ్ అశ్విన్ ప్రెస్ మీట్‌లో పేర్కొన్నారు.

ఈ చిత్రం గ్రాండ్ రిసెప్షన్‌తో, యానిమేషన్ సిరీస్‌లోని మిగిలిన ఎపిసోడ్‌ల విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో వేచి చూడాల్సిందే. దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, శోభన, మృణాల్ ఠాకూర్, మాళవిక నాయర్ మరియు ఇతరులు ఇందులో కీలక పాత్రల్లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

Exit mobile version