మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ మూవీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేయగా ఎన్టీఆర్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో చేయనున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ను త్వరలో స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
అయితే, ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. కానీ, ఇప్పుడు ఈ టైటిల్ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగుతోంది. ఈ టైటిల్‌ను ఎన్టీఆర్ చిత్రానికి పెట్టవద్దంటూ అభిమానులు కోరుతున్నారు. తమిళ డైరెక్టర్ కమ్ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి కూడా ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ చిత్రానికి కూడా అదే టైటిల్ పెడితే రిలీజ్ సమయంలో గందరగోళం నెలకొనే ఛాన్స్ ఉందని అభిమానులు అంటున్నారు. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్-నీల్ మూవీ టైటిల్‌పై మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.