Devara Tickets: ‘దేవర’ కోసం నైజాం బాబులు వెయిటింగ్

దేవర.. ప్రస్తుతం తెలుగు సినిమా లవర్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్న మూవీ. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఇక ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇప్పటికే ఓవర్సీస్‌లో ‘దేవర’ టికెట్ బుకింగ్స్ రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తున్నాయి. ఇదిలా ఉండగా, ఏపీలోనూ ‘దేవర’ టికెట్ల బుకింగ్స్ ఓపెన్ కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, నైజాం ఏరియాలో ఇంకా ‘దేవర’ టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

రీసెంట్‌గా ‘దేవర’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ కావడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాకపోవడంతో వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా టికెట్లు ఎప్పుడెప్పుడు తెరుచుకుంటాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Exit mobile version