గ్లోబల్ స్టార్ చరణ్ కి గ్రాండ్ వెల్కమ్ ప్లాన్ లో ఫ్యాన్స్.!

గ్లోబల్ స్టార్ చరణ్ కి గ్రాండ్ వెల్కమ్ ప్లాన్ లో ఫ్యాన్స్.!

Published on Mar 16, 2023 7:38 PM IST


తన సెన్సేషనల్ హిట్ సినిమా RRR తో గ్లోబల్ స్టార్ గా మారిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యూఎస్ లో జరిగిన ప్రిస్టేజియస్ అవార్డు వేడుక ఆస్కార్ కి గాను చిత్ర యూనిట్ కన్నా ముందే ఆహ్వానం మేర వెళ్లిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా తమ చిత్రం నుంచి నాటు నాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా నిలిచి చరిత్ర సృష్టించింది.

ఇక ఈ గ్రాండ్ ఈవెంట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదట హైదరాబాద్ కి వచ్చేయగా తెల్లవారు జామున కూడా తారక్ ఫ్యాన్స్ తనకి ఘన స్వాగతం అందించారు. ఇక ఇప్పుడు అయితే మార్చ్ 17న చరణ్ రిటర్న్ అవుతుండగా హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ లో అయితే తనకి గ్రాండ్ వెల్కమ్ అందించాలని ఇప్పుడు చరణ్ ఫ్యాన్స్ అయితే ప్లాన్ లు వేస్తున్నారు. దీనితో చరణ్ కి మాత్రం రేపు మెగా ఫ్యాన్స్ అదిరే ఆహ్వానం ఇవ్వనున్నారని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు