ఎన్టీఆర్ లైనప్ తో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర పార్ట్1 ఈ ఏడాది సెప్టెంబర్ 27, 2024 న థియేటర్ల లోకి రానుంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చిత్రం ప్రారంభం అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని జనవరి 9, 2026 లో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి.

ఈ ఏడాది దేవర పార్ట్ 1 తో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. వచ్చే ఏడాది అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వార్ 2 చిత్రం ఆగస్టు 14 వ తేదీన రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరొక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది దేవర పార్ట్ 2 కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వరుస నాలుగు చిత్రాలతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఈ చిత్రాలతో పాటుగా, ఇంకెన్ని చిత్రాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో చూడాలి.

Exit mobile version