ఇంటర్వ్యూ: ‘మత్తు వదలారా 2’ ఖచ్చితంగా అందరినీ అలరిస్తుంది – ఫరియా అబ్దుల్లా

బ్లాక్ బస్టర్ మూవీ ‘మత్తు వదలరా’కు సీక్వెల్‌గా ‘మత్తు వదలారా 2’ ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమౌతోంది. శ్రీ సింహ కోడూరి లీడ్ రోల్‌లో తన సైడ్ కిక్‌గా సత్య నటిస్తున్న ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

‘మత్తు వదలారా 2’ ప్రాజెక్ట్‌లోకి ఎలా వచ్చారు? కథ విన్నప్పుడు ఏం అనిపించింది?

‘మత్తు వదలారా 2’ ఒక థ్రిల్లర్. యాక్టర్స్ ట్రాజెడీ నుంచి కామెడీ జనరేట్ అవుతుంది.. కథ చాలా నచ్చింది. విన్న వెంటనే ఇమ్మీడియట్‌గా ఓకే చేసేశా. మత్తు వదలారా పార్ట్ 1 బిగ్ హిట్. సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది. శ్రీసింహ, సత్య క్యారెక్టర్స్ డెలివరీ బాయ్స్ నుంచి స్పెషల్ ఏజెం‌ గా కనిపిస్తారు.

ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?

ఇందులో నా క్యారెక్టర్ పేరు సన్నిధి. తను కూడా ఒక స్పెషల్ ఏజెంట్. శ్రీసింహ, సత్య క్యారెక్టర్స్‌పై సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఇందులో నా క్యారెక్టర్‌కు యాక్షన్ ఉంటుంది. మ్యాచో రోల్. అది నాకు చాలా నచ్చింది. గన్స్‌తో యాక్షన్ ప్లే చేయడం చాలా ఎంజాయ్ చేశా. ఈ సినిమాలో లిరిక్స్ రాయడంతో పాటు సాంగ్ పాడాను. డైరెక్టర్ రితేష్‌కి ఈ ఆలోచన చెప్పినపుడు ఆయనకి చాలా నచ్చింది. అలాగే నా టీంతో సాంగ్ కొరియోగ్రఫీ కూడా చేశాను.

శ్రీసింహ, సత్యలది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ కదా.. ఆ కాంబోని మీరు ఎలా మ్యాచ్ చేశారు?

నేను అందరితో కలసిపోతాను. వాళ్ళ హై ఎనర్జీ పెర్ఫార్మెన్స్‌కి నా క్యారెక్టర్ బ్యాలెన్స్ చేస్తుంది. ఇందులో నా క్యారెక్టర్ కాస్త స్మార్ట్‌గా ఉంటుంది.

డైరెక్టర్ రితేష్ రానా గురించి?

రితేష్ రానా చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. చాలా క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఆయన అంత ఫ్రీడమ్ ఇవ్వబట్టే సాంగ్ కొలాబరేషన్ సాధ్యపడింది. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది.

కల్కిలో రోల్ చేయడం ఎలా అనిపించింది?

చాలా ఎక్సయిటింగ్ ఎక్స్‌పీరియన్స్ అది. డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కి థాంక్ యూ. ప్రభాస్ గారితో బిగ్గర్ రోల్ ఉండే సినిమా చేయాలని కోరుకుంటున్నాను.

శ్రీసింహ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

శ్రీసింహ వెరీ ట్యాలెంటెడ్, స్వీట్ పర్సన్. చాలా హార్డ్ వర్కింగ్ చేస్తారు. ఆయనతో మళ్ళీ కలసి పని చేయాలని ఉంది.

సునీల్, వెన్నెల కిషోర్ పాత్రల గురించి?

వెన్నెల కిషోర్ గారితో ‘జాతిరత్నాల’ నుంచి పరిచయం ఉంది. సునీల్ గారు జెమ్. వారి పాత్రలు ప్రేక్షకులని చాలా ఎంటర్‌టైన్ చేస్తాయి.

కాల భైరవ గారితో కలసి పని చేయడం ఎలా అనిపించింది?

కాల భైరవ గారి మ్యూజిక్ సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. నా సాంగ్‌ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్ళారు.

క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాతల గురించి?

చాలా సపోర్ట్ చేశారు. చాలా కంఫర్ట్‌బుల్‌గా చూసుకున్నారు. వారితో పని చేయడం బ్యూటీఫుల్ ఎక్స్‌పీరియన్స్. నాకు చిన్నప్పటి నుంచి రైటింగ్‌పై ఆసక్తి ఉంది. ఈ సినిమాలో పాట రాసే అవకాశం కూడా ఇవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

‘మత్తు వదలరా’కి పార్ట్ 2కి ఎలాంటి పోలికలు ఉంటాయి?

‘మత్తు వదలరా’ ఫ్యాన్ బేస్ ఇందులో ఉండే కంటెంట్‌ని చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే స్టాండ్‌లోన్ సినిమాగా కూడా ఈ మూవీ చాలా ఎంటర్‌టైన్ చేస్తుంది.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి?

తిరువీర్‌తో ఓ లవ్ స్టొరీ చేస్తున్నాను. ఒక తమిళ్ మూవీ స్టార్ట్ కాబోతోంది.

Exit mobile version