ప్రభాస్ ఫుడ్ ట్రీట్.. ఫిదా అయిన ‘ఫౌజీ’ బ్యూటీ

ప్రభాస్ ఫుడ్ ట్రీట్.. ఫిదా అయిన ‘ఫౌజీ’ బ్యూటీ

Published on Jan 31, 2025 3:17 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ‘ఫౌజీ’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పీరియాడిక్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా వార్, ప్రేమకథ నేపథ్యంలో సాగనుంది. అయితే, ఈ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇమాన్వి నటిస్తోంది.

ఈ బ్యూటీ ఇప్పుడు ప్రభాస్ ఇచ్చిన ఫుడ్ ట్రీట్‌కు ఫిదా అయ్యింది. ప్రస్తుతం ‘ఫౌజీ’ చిత్ర షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ చిత్ర షూటింగ్ సందర్భంగా హీరోయిన్ ఇమాన్వి కోసం ప్రభాస్ తన ఇంటి నుంచి భోజనం పంపారు. ఈ భోజనం చూసి ఇమాన్వి సంతోషం వ్యక్తం చేస్తుంది. ప్రభాస్ ఇచ్చిన ఫుడ్ ట్రీట్ అదిరిపోయిందని.. తాను ఇలాంటి ఫుడ్ ఇప్పటివరకు తినలేదని ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.

ఇక దీనికి సంబంధించి ఇమాన్వి తన ఇన్‌స్టో స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ ఫౌజీ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు