ఫియర్ సాంగ్: లిరికల్ వీడియో రిలీజ్!

ఫియర్ సాంగ్: లిరికల్ వీడియో రిలీజ్!

Published on Jun 20, 2024 3:59 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. ఈ చిత్రం ను సెప్టెంబర్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా దేవర చిత్రం కి సంబందించిన ఫియర్ సాంగ్ లిరికల్ వీడియో ను మేకర్స్ నేడు రిలీజ్ చేశారు.

అంతకుముందు అనిరుద్ రవి చందర్ మరియు ఎన్టీఆర్ లతో ఉన్న వీడియో సాంగ్ ను రిలీజ్ చేయగా, సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా లిరికల్ వీడియో ను రిలీజ్ చేశారు. ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాయగా, అనిరుద్ రవి చందర్ పాడటం జరిగింది. అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్,ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు