‘హను మాన్’ తో తేజ సజ్జ ని స్టార్ ని చేసినందుకు హ్యాపీ గా ఉంది – డైరెక్టర్ ప్రశాంత్ వర్మ


యువ నటుడు తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఫాంటసీ ఎంటర్టైనర్ మూవీ హను మాన్. ఇటీవల సంక్రాంతి కానుకగా మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈమూవీ భారీ సక్సెస్ తో ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ తో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నేడు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ, తనకు మొదటి నుండి ఎంతో సపోర్ట్ అందించిన తన భార్య, తల్లికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఇక తనని నిర్మాత నిరంజన్ రెడ్డి గారికి పరిచయం చేసిన పీఆర్వో వంశీ, శేఖర్ కి కూడా స్పెషల్ గా థాంక్స్ చెప్పారు. నిరంజన్ రెడ్డి గారి వంటి మనసున్న మంచి ప్రొడ్యూసర్ మాకు దొరకడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఆద్యంతం ఆయన అందించిన సపోర్ట్ ఎంతో గొప్పదని అన్నారు. ఇక తేజ సజ్జ చైల్డ్ ఆర్టిస్ట్ అప్పటి నుండి తనకు తెలుసునని, అయితే అతడితో సినిమా ఎప్పుడు చేస్తావు అని తనని పలువురు అడిగారని అన్నారు. కానీ నేను మంచి యాక్టర్స్ తోనే సినిమాలు చేస్తానని వారితో అనేవాడినని అన్నారు.

ఇక హను మాన్ లో అతనిని హీరోగా ఎంచుకోవడం రైట్ ఛాయిస్ అని, ఆ పాత్ర లో తను ఒదిగిపోయి యాక్ట్ చేసాడు అనేది తాను చెప్పడం కాదు, ఈరోజున మూవీ చూసిన ప్రతి ఒక్కరు అంటున్నారని అన్నారు. తేజని హీరోగా చేయడం ఎంత సంతృప్తిని అందించిందో, ఈ మూవీతో అతడు స్టార్ గా పేరు అందుకోవడం మరింత ఆనందాన్నిస్తోందని తెలిపారు. హీరోయిన్ అమృత అయ్యర్, నటి వరలక్ష్మి శరత్ కుమార్, విలన్ గా చేసిన వినయ్ రాయ్ ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎంతో అద్భుతంగా నటించి సినిమాకి మారేంత వన్నె తీసుకువచ్చారని, మొత్తంగా తమ సినిమాని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు ప్రశాంత్ వర్మ.

Exit mobile version