బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఫైటర్. ఈ చిత్రం వీక్ డేస్ లో డల్ గా వసూళ్లు రాబడుతూ, వీకెండ్స్ లో మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం ఆదివారం మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. ఈ చిత్రం కి సంబందించిన వసూళ్ల వివరాలను మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.
ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 302 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టడం జరిగింది. ఈ చిత్రం లో దీపికా పదుకునే హీరోయిన్ గా నటించగా, అనీల్ కపూర్ మరొక కీలక పాత్రలో నటించడం జరిగింది. వయాకాం స్టూడియోస్ మరియు మార్ఫ్లిక్స్ బ్యానర్ లపై నిర్మించిన ఈ చిత్రం లాంగ్ రన్ లో ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.