అనుష్క సినిమాను ఓటిటి లోనే కోరుకుంటున్నారు.!

Published on Aug 12, 2020 3:00 am IST


మన దక్షిణాదిలోనే ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు అంటే మొదటగా మనకి గుర్తొచ్చేది స్టార్ హీరోయిన్ అనుష్క అని చెప్పాలి. డెడికేషన్ ఎంత వరకు అయినా వెళ్లి చాలా ఛాలెంజింగ్ రోల్స్ చేసిన అనుష్క నటించిన మరో లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ చిత్రం “నిశ్శబ్దం”. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గత ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సి ఉంది కానీ ఊహించని విధంగా పరిస్థితులు మారిపోవడంతో ఆగిపోవాల్సి వచ్చింది.

దానితో అక్కడ నుంచి ఈ చిత్రం ఓటిటి ప్లాట్ ఫామ్ లో రానుంది అని టాక్ వినిపించింది. కానీ వీటన్నిటినీ చిత్ర యూనిట్ ఖండించారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ చిత్రం ఓటిటి లో చూడడానికే చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ రచయిత కోనా వెంకట్ ఈ చిత్రం ఎలా చూడాలనుకుంటున్నారని ఓ పోల్ పెట్టగా అందులో 56 శాతం మంది ఓటిటి లో చూసేందుకే ప్రిఫర్ చేసారు. మొత్తం ఐదు భాషల్లో ప్లాన్ చేసిన ఈ చిత్రాన్ని చిత్ర యూనిట్ ఎలా విడుదల చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More