ఫిల్మ్ ట్రివియా : ఈ పాపులర్ హీరోయిన్ ఎవరో గెస్ చెయ్యగలరా?

ఫిల్మ్ ట్రివియా : ఈ పాపులర్ హీరోయిన్ ఎవరో గెస్ చెయ్యగలరా?

Published on Aug 26, 2020 8:06 PM IST

ఈ సెక్షన్ లో మేము 123తెలుగు ద్వారా మీకు తెలియని ఎన్నో ఆసక్తికర అంశాలను వెల్లడిస్తాము. నటులు, బాక్సాఫీస్, మ్యూజిక్, టెక్నిషీయన్స్ ఇలా ఎన్నో అంశాలకు సంబంధించి ఒక ప్రశ్న అడుగుతాము.

ఈరోజు హింట్ :

ఈరోజు మా ప్రశ్న ఏమిటంటే బాలీవుడ్ లో ఎందరో స్టార్ హీరోయిన్స్ ఉన్నారు, అలా ఉన్న స్టార్ హీరోయిన్స్ లో ఒకామె చివరి నిమిషంలో వద్దనుకున్న చిత్రంలోకి మనకి అందరికీలే బాగా తెలిసిన హీరోయిన్ వచ్చి చేరింది. అంతే ఆ సినిమా విడుదలైన తర్వాత ఒక్క సారిగా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. మరి ఆ హీరోయిన్ ఎవరో మీకు తెలిస్తే ఆ పేరును కింద కామెంట్ సెక్షన్ లో తెలుపండి.


సమాధానం :

ఇక అసలు సమాధానం ఏమిటంటే ఆ హీరోయిన్ మరెవరో కాదు మనకు బాగా తెలిసిన నడుము సుందరి ఇలియానా. అలాగే ఆ చిత్రం “బర్ఫీ”. నిజానికి ఈ చిత్ర దర్శకుడు ఈ చిత్రంలో ఫిమేల్ లీడ్ గా అక్కడి స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ను ఎంచుకున్నారు. కానీ ఇంకా షూటింగ్ కు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉందన్న సమయంలో ఆమె రిజెక్ట్ చేసి బయటకు వెళ్ళిపోయింది. కానీ అదే సమయంలో ఇలియానా ఈ అవకాశం దక్కించుకొని ఈ చిత్రంతో ఒక్కసారిగా భారీ విజయాన్ని అందుకుంది. ఇక అక్కడి నుంచి ఇలియానా అక్కడ కూడా మంచి బిజీ అయ్యి మరిన్ని సినిమాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు