ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అవైటెడ్ “మిర్జాపూర్ 3”


మన ఇండియన్ ఓటిటి దగ్గర పాపులర్ అయినటువంటి పలు క్రేజీ వెబ్ సిరీస్ లు ఉన్నాయి. మరి ఈ సిరీస్ లలో అయితే దాదాపు చాలా శాతం ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే ఉన్నాయని చెప్పాలి. మరి ఇందులో సెన్సేషనల్ హిట్ అయినటువంటి సిరీస్ లలో కేజ్రీ బోల్డ్ అండ్ గ్యాంగ్ స్టర్ సిరీస్ “మిర్జాపూర్” కూడా ఒకటి.

ఇప్పటికే వచ్చిన రెండు సీజన్ లు మంచి హిట్ గా నిలవగా ఇప్పుడు ఈ సిరీస్ లో మూడో సీజన్ ఫైనల్ గా ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది. మొత్తం 10 ఎపిసోడ్స్ గా ప్రైమ్ వీడియో వారు ఒకేసారి విడుదల చేసేసారు. అలాగే ముందు లానే హిందీ సహా అన్ని దక్షిణాది భాషల్లో అందుబాటులోకి ఉంచారు.

మరి ఈ క్రేజీ సిరీస్ మూడో సీజన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇక ఈ వారాంతానికి మంచి ఓటిటి కంటెంట్ చూడాలి అనుకుంటున్న ఫ్యాన్స్ కి ఇది ట్రీట్ అని చెప్పొచ్చు. ఇక ఈ సిరీస్ లో పంకజ్ త్రిపాఠీ, శ్వేతా త్రిపాఠీ, అలీ ఫజల్ అలాగే గుండె జారి గల్లంతయ్యిందే ఫేమ్ ఇషా తల్వార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Exit mobile version