దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో సంచలనం రేపిన ఎన్నో వెబ్ సిరీస్ లలో కొరియన్ సెన్సేషనల్ హిట్ సిరీస్ స్క్విడ్ గేమ్ కూడా ఒకటి. అయితే అప్పుడెప్పుడో లాక్ డౌన్ సమయంలో వచ్చిన సీజన్ 1 రికార్డ్ బ్రేకింగ్ హిట్ కాగా మళ్లీ ఇన్నాళ్లకు సీజన్ 2 ని మేకర్స్ గత ఏడాది డిసెంబరులో తీసుకొచ్చారు. అయితే ఈ సీజన్ ని అర్ధాంతరంగా ముగించడంతో చాలా మందికి నచ్చలేదు. పైగా దానిని మళ్లీ చివరి సీజన్ గా సాగదీయడం అనేది కూడా అనవసరంగా చేస్తున్నారు అనిపించింది. కానీ ఫైనల్ గా ఈ సిరీస్ ఫైనల్ సీజన్ కి డేట్ ని నెట్ ఫ్లిక్స్ వారు అనౌన్స్ చేసేసారు. దీనితో మొన్నామధ్య లీక్ అయ్యినట్టుగా జూన్ లోనే ఈ ఫైనల్ సీజన్ రాబోతుంది. జూన్ 27న ఈ అవైటెడ్ సిరీస్ ముగియనున్నట్టు ఇపుడు నెట్ ఫ్లిక్స్ వారు కన్ఫర్మ్ చేశారు. మరి ఇదెలా ఉండబోతోందో చూడాలి.
Nothing can prepare you for the final season. Squid Game Season 3 premieres June 27. #NextOnNetflix pic.twitter.com/qoPAqWTRHD
— Squid Game (@squidgame) January 30, 2025