ఊహాగానాలకు తెర, చిరు152 హీరోయిన్ ఆమెనే.

ఊహాగానాలకు తెర, చిరు152 హీరోయిన్ ఆమెనే.

Published on Mar 22, 2020 7:15 PM IST

మెగాస్టార్ 152వ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సోషల్ కాన్సెప్ట్ తో కూడిన కమర్షియల్ మూవీ తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీలో మొదట హీరోయిన్ గా త్రిషని అనుకున్నారు. ఆమె షూటింగ్ లో కూడా పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. కాగా కొద్దిరోజుల క్రితం త్రిష చిరంజీవి మూవీ నుండి బయటికి వెళ్ళిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించేసింది.

దీనితో చిరు సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంలో అనేక ఊహాగానాలు బయటికి రావడం జరిగింది. ఐతే ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు అధికారికంగా నిరూపితమైంది. కాజల్ తన ఇంస్టాగ్రామ్ లో అభిమానులకు దీనిపై స్పష్టత ఇచ్చారు. గతంలో చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ 150లో కాజల్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు