కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా మాత్రమే కాకుండా దర్శకునిగా కూడా సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇలా తన దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ సినిమానే “జాబిలమ్మ నీకు అంత కోపమా”. యంగ్ హీరో హీరోయిన్స్ పవీష్ నారాయణన్ అలాగే అనికా సురేంద్రన్ కలయికలో తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ లవ్ స్టొరీ తెలుగు సహా తమిళ్ లో పర్వాలేదనిపించింది.
మరి ఈ చిత్రం ఓటీటీలో కొన్ని రోజులు కితమే వచ్చింది కానీ తెలుగు వెర్షన్ మాత్రం ఇంకా ఇండియాలో అందుబాటులోకి రాలేదు. అలాగే ఇండియన్ వెర్షన్ ఓటీటీ కూడా సస్పెన్స్ గానే మారగా ఇపుడు ఫైనల్ గా ఈ సినిమా తెలుగులో వచ్చేసింది. మరి ఈ సినిమా రీసెంట్ గానే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చేసింది. సో అపుడు మిస్ అయ్యినవారు ఇపుడు ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించగా ప్రియాంక మోహన్ స్పెషల్ సాంగ్ లో కనిపించింది.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి