రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “కల్కి 2898 ఎడి”

రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “కల్కి 2898 ఎడి”

Published on Aug 22, 2024 7:02 AM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా అలాగే దిశా పటాని ఫీమేల్ లీడ్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ అయ్యి ప్రభాస్ కెరీర్ లోనే కాకుండా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కూడా రికార్డ్ గ్రాసర్ గా నిలిచింది. మరి ఈ సినిమా ఫైనల్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

ఈ సినిమాని మేకర్స్ ప్రముఖ స్ట్రీమింగ్ యాప్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో అలాగే నెట్ ఫ్లిక్స్ లకు అమ్మగా వీటిలో ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం నేటి నుంచి తెలుగు సహా ఇతర సౌత్ భాషల్లో అందుబాటులోకి రాగా నెట్ ఫ్లిక్స్ లో నేటి నుంచి హిందీలో అందుబాటులోకి వచ్చేసింది. మరి ఈ సినిమాకి ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయాలి అనుకునేవారు వీటిలో చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ భారీ సినిమాలో కమల్, అమితాబ్ లాంటి దిగ్గజ నటులు కూడా నటించగా వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు