ప్రస్తుతం మన టాలీవుడ్ లో నిలకడగా సాలిడ్ హిట్స్ కొడుతూ మంచి మార్కెట్ ని మైంటైన్ చేస్తున్న యువ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది నాచురల్ స్టార్ నాని అనే చెప్పాలి. గత మూడు సినిమాలు వరుస హిట్స్ కొట్టి థియేట్రికల్ అలాగే నాన్ థియేట్రికల్ గా కూడా నాని మంచి లాభాలు అందించాడు. మరి లేటెస్ట్ గా వచ్చిన మాస్ చిత్రంతో మరోసారి తన మాస్ స్టామినా చూపించాడు అని చెప్పాలి.
గత ఏడాది వచ్చిన “దసరా” సినిమా 100 కోట్లకి పైగా గ్రాస్ ని కొడితే ఇప్పుడు “సరిపోదా శనివారం” తో కూడా మరో 100 కోట్ల సినిమాని తన ఖాతాలో వేసుకున్నాడని చెప్పాలి. ఇదే సినిమా దర్శకుడు వివేక్ ఆత్రేయతో చేసిన “అంటే సుందరానికీ” సినిమా తెలుగు స్టేట్స్ లో అంత బాగా పెర్ఫామ్ చేయలేదు. మరి దానికి డబుల్ ప్రాఫిట్స్ ని సరిపోదా శనివారం తో నాని, వివేక్ లు ఇచ్చేశారని చెప్పాలి.
ఇలా మొత్తానికి అయితే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సహా నాని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 100 కోట్ల మార్క్ ఈ వీకెండ్ తో సరిపోదా శనివారం కొట్టేసి నాని కెరీర్ లో మరో మైలురాయి సినిమాగా ఇది నిలిచిపోయింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో ఎస్ జే సూర్య విలన్ గా నటించగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. అలాగే జేక్స్ బిజోయ్ క్రేజీ మ్యూజిక్ ని ఈ చిత్రానికి అందించాడు.
Ippudu Saripoyindhi ❤️❤️
Won’t say thank you because you all stood like family and made sure it crossed the line with a BANG at the box office ????????????????
Finally – Poyaru Motham Poyaru ????????#SaripodhaaSanivaaram @NameisNani @iam_SJSuryah @priyankaamohan #VivekAthreya @JXBE pic.twitter.com/ZJx8KG4wpA
— DVV Entertainment (@DVVMovies) September 15, 2024