Kanguva: సూర్య “కంగువా” కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది..


కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా చేసిన లేటెస్ట్ చిత్రమే “కంగువా”. దర్శకుడు శివతో చేసిన ఈ సెన్సేషనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా రిలీజ్ ని వాయిదా వేస్తున్నట్టుగా కొన్ని రోజులు కితమే మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. అయితే దీని తర్వాత కొత్త రిలీజ్ డేట్ అనేది సస్పెన్స్ గా మారగా నవంబర్ రిలీజ్ అన్నట్టుగా పలు రూమర్స్ వచ్చాయి. అయితే ఈ సస్పెన్స్ పై ఫైనల్ గా మేకర్స్ సాలిడ్ క్లారిటీ ఇచ్చేసారు.

మరి వచ్చిన రూమర్స్ ప్రకారం డేట్ నే అఫీషియల్ గా మేకర్స్ ప్రకటించేసారు. దీనితో ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ గా నవంబర్ 14న రిలీస్ కి తీసుకొంటున్నట్టుగా ప్రకటించేసారు. దీనితో అభిమానులు ఎదురు చూస్తున్న సస్పెన్స్ కి తెర లేచిపోయింది అని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రంలో దిశా పటాని హీరోయిన్ గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అలాగే స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు.

Exit mobile version