టాలీవుడ్ పవర్ స్టార్ అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు సినిమాలు మొదలు పెడతారా అని అభిమానులు ఎప్పుడు నుంచో ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు పవన్ చేస్తున్న భారీ చిత్రాల్లో రెండు పాన్ ఇండియా సినిమాలు ఉండగా వాటిలో దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న అవైటెడ్ పీరియాడిక్ చిత్రం “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. మరి ఇది ఎప్పుడో మొదలైనప్పటికీ ఇంకా ఒక కొలిక్కి రాలేదు.
అయితే ఫైనల్ గా ఈ సినిమా పట్టాలెక్కేందుకు దాదాపు రంగం సిద్ధం అయ్యినట్టు తెలుస్తుంది. లేటెస్ట్ స్ట్రాంగ్ బజ్ ప్రకారం వీరమల్లుగా పవన్ కళ్యాణ్ ఈ సెప్టెంబర్ చివరి వారంలో కానీ అక్టోబర్ మొదటి వారం నుంచే సంగ్రామంలో అడుగు పెట్టనున్నట్టుగా వినిపిస్తుంది. ఒక పూట తన సినిమా మరోపూట రాజకీయ కార్యకలాపాలు ఉండేలా పవన్ ప్లాన్ చేసుకుంటున్నటుగా తెలుస్తుంది. సో మొత్తానికి మళ్ళీ వీరమల్లు ఆరంభం కాబోతుంది అని చెప్పాలి.